2002లో ఈ హత్య జరగగా ఈ కేసును విచారించిన సిబిఐ అనంతరం ఇందులో ప్రత్యూష స్నేహితుడు సిద్ధార్థ రెడ్డిని సిబిఐ నిందితుడిగా వెల్లడించింది. దీంతో ఈ కేసు పైన విచారణ జరిపిన నాంపల్లి కోర్టు ఇతడికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించింది. అయితే ప్రత్యూష కుటుంబం మాత్రం ఇలాంటి పని చేసిన వారికి ఏడేళ్లు జైలు శిక్ష సరిపోదు అంటూ కుటుంబ సభ్యులు హైకోర్టుని ఆశ్రయించారు. తమ కూతురు ప్రత్యూషను చాలా క్రూరంగా అత్యాచారం చేశారని తల్లి సరోజిని ఆరోపణలు చేసింది.
అలా 2006లో హైకోర్టుని ఆశ్రయించగా, 2011 వరకు ఈ కేసు విచారణ జరిపిన కోర్టు సిద్ధార్థ రెడ్డికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లేవని, అతని జైలు శిక్షను రెండున్నర ఏళ్లకు తగ్గించింది. అనంతరం 2011లో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రత్యూష కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనిపైన సుప్రీంకోర్టు విచారణ జరపడం మొదలు పెట్టింది. అలా అప్పటినుంచి సుమారుగా 14 ఏళ్లపాటు సుప్రీంకోర్టులోనే ఈ విచారణ కొనసాగుతూ ఉంది. ఎట్టకేలకు ఈ రోజున తుది తీర్పు రానుంది. మరి ఈ కేసులో నిందితుడుగా ఉన్న సిద్ధార్థ రెడ్డికి శిక్ష పడుతుందా లేదా అని ఆటు అభిమానులు కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఏం జరుగుతుందో మరో కొన్ని గంటలలో తెలియనుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి