టాలీవుడ్ లో మాస్ కా దాస్ గా పేరు పొందిన హీరో విశ్వక్ సేన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నిరంతరం ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలలో, విభిన్నమైన కాన్సెప్ట్ తో సినిమా కథలను ఎంచుకుంటూ అభిమానులను మెప్పిస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో విశ్వక్ సెన్ నటించిన సినిమాలేవి కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ వరుస సినిమాలలో మాత్రం నటిస్తున్నారు. అలా తాజాగా నటిస్తున్న చిత్రం కల్ట్. ఈ చిత్రం మోస్ట్ వైలెట్ కంటెంట్ తో రాబోతోంది. ఈ సినిమాకి విశ్వక్ సేన్ దర్శకత్వం వహించారు.


చాలాకాలం తర్వాత ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. ఇటువంటి సందర్భంలోనే కల్ట్ సినిమా నుంచి విడుదలైన టీజర్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. టీజర్ లో  చూపించిన విషయానికి వస్తే.. ఓ ముగ్గురు కుర్రాళ్ళు గోవాకు వెళ్తారు అక్కడ పబ్బులోకి వెళ్లేందుకు ఎంట్రీ దొరకదు.. దీంతో కల్ట్ అనే చోటుకి పాసులు లభించగా అక్కడికి వెళ్తారు. ఇక లోపలికి వెళ్లిన తర్వాత ఎంజాయ్ చేసిన తర్వాత స్క్రీన్ పై ఒక బొమ్మ కనిపిస్తుంది. అందులో కొన్ని గేమ్స్ పెడుతూ ఉంటుంది. ఈ గేమ్స్ స్వీడ్ గేమ్ సిరీస్ గుర్తుకు వచ్చేలా కనిపిస్తోంది. ఎందుకంటే స్వీడ్ గేమ్ లో ఎలిమినేట్ అయిన వారందరినీ కూడా చంపేస్తుంటారు. ఇందులో కూడా ఇలాగే గేమ్స్ లో ఎలిమినేట్ అయ్యే వాళ్ళని చంపుతూ ఉంటారు.

కల్ట్ సినిమాలో విశ్వక్ పాత్ర ఏంటి? అనే విషయం తెలియాలి అంటే ట్రైలర్ వచ్చేవరకు ఆగాల్సిందే. కానీ టీజర్ తోనే మాత్రం సినిమా హైప్ భారీగా పెంచేశారు. విశ్వక్ గత సినిమాలలో కంటే ఈ సినిమాలో చాలా భిన్నంగా వైలెంట్ గా కనిపించబోతున్నారు. చివరిగా విశ్వక్ సెన్ ఫంకీ అనే సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చిన పెద్దగా సక్సెస్ అందుకోలేదు. మరి కల్ట్ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: