టాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా పేరు సంపాదించిన విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం ఎట్టకేలకు ఈనెల 26న వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. గత కొంతకాలంగా వీరి వివాహం గురించి పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్లోని ఉదయపూర్ లో వీరి వివాహం అత్యంత సన్నిహితులు, బంధువుల, కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుంది. ఈ వేడుక కోసం ఇరువురు కుటుంబ కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న వాటికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


అయితే ఇటువంటి సందర్భంలోనే రష్మిక, విజయ్ ఓకే రోజు రెండుసార్లు వివాహం చేసుకోబోతున్నట్లు వినిపిస్తున్నాయి. అటు తెలుగు సాంప్రదాయంతో పాటుగా కోడవ(కూర్గ్) సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోబోతున్నట్లు వినిపిస్తున్నాయి. బుధవారం ఉదయం హాల్ది వేడుక, సాయంత్రం మెహందీ కార్యక్రమాలు జరగనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగబోతోంది. ఉదయం తెలుగు సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరగనుండగా, సాయంత్రం వేళ రష్మిక తన సొంత ఊరి పద్ధతి కొడవ పద్ధతిలో వివాహం జరగనుంది.


 వివాహం అనంతరం శుక్రవారం రోజున హైదరాబాద్ కి తిరిగి రాబోతున్నారు. మార్చి 3న బంజరాహిల్స్లో తాజ్ కృష్ణలో ఏర్పాటుచేసిన భారీ రిసెప్షన్ కి ప్రముఖ రాజకీయ నాయకులు, వీఐపీలు ,సెలబ్రిటీలు కూడా అక్కడ విచ్చేయనున్నారు. మొత్తానికి ఈ జంట వివాహ బంధంతో ఒకటి కావడం అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ముఖ్యంగా అభిమానులు కోరుకున్నట్లే విరోష్ అనే పేరుతో వీరికి సంబంధించిన అన్ని పనులను చేస్తున్నారు. విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే.. రౌడీ జనార్ధన్, రణబాలి వంటి చిత్రాలలో నటిస్తున్నారు. ఈ ఏడాది ఒక సినిమాని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. రష్మిక సినిమాల విషయానికి వస్తే.. కాక్టైల్ 2 సినిమాతో పాటుగా మైస అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: