సీనియర్ నటి లయ.. ఒకప్పుడు తన సినిమాలతో ఎంతో మంచి ఫాలోయింగ్ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత ఇండియా వదిలేసి వెళ్లి విదేశాల్లోనే సెటిలైంది. కానీ ఈ మధ్యకాలంలో మళ్లీ ఇండియాకి వచ్చి టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటుంది. అలా నితిన్ నటించిన తమ్ముడు సినిమాతో మళ్లీ టాలీవుడ్ కి  రీ ఇంట్రీ ఇచ్చింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా సీనియర్ నటుడు శివాజీ తో కలిసి సాంప్రదాయిని సుప్పిని సుద్ద పూసిని అనే సినిమాలో నటించింది. అయితే గతంలో శివాజీ లయ జంటకి మంచి క్రేజ్ ఉండేది.వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు హిట్ అవ్వడంతో అప్పట్లో ఈ జంట కాంబినేషన్లో సినిమాలు చేస్తే హిట్ అనే సెంటిమెంట్ ఉండేది. 

అయితే అప్పటి సెంటిమెంట్ ని మళ్ళీ రిపీట్ చేయాలనే ఉద్దేశంతో తాజాగా వీరి కాంబోలో సినిమా తీశారు దర్శకనిర్మాతలు.ఈ సినిమా మార్చ్ 6 న విడుదల కాబోతుండగా తాజాగా సినిమాకి సంబంధించిన ఈవెంట్లో నిర్మాత హీరోయిన్ గురించి మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. నిర్మాత వంశీ నందిపాటి హీరోయిన్ లయ "నందులను పందుల్లా పెంచింది" అంటూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. అయితే నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడిన మాటలు విన్న అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంతో షాక్ అయిపోయారు. దాంతో ఈయన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజెన్లు నిర్మాత వంశీ మాట్లాడిన మాటలపై ఫైర్ అవుతున్నారు.

 ఒక బాధ్యతమైన స్థానంలో ఉన్న మీరు హీరోయిన్ గురించి అలా మాట్లాడటం కరెక్టేనా.. హీరోయిన్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా సినీ ఇండస్ట్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డులను సైతం అవమానించేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు నిర్మాత వంశీ నందిపాటి బహిరంగంగా హీరోయిన్ కి క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.ఇక మరికొంత మందేమో నిర్మాత మాట్లాడిన మాటలు వేరే ఉద్దేశంతో మాట్లాడారని,తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు.ఏది ఏమైనప్పటికి సోషల్ మీడియాలో ఈ విషయం వివాదాస్పదంగా మారడంతో నిర్మాత దిగివచ్చి క్షమాపణలు చెబితే అంత సెట్ అవుతుందని అనుకుంటున్నారు. ఇక ఈ నిర్మాత వంశీ నందిపాటి ఎవరో కాదు లిటిల్ హార్ట్స్, ఈషా, రాజు వెడ్స్ రాంబాయి వంటి సినిమాలను నిర్మించి సక్సెస్ఫుల్ నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తున్న  వ్యక్తే..

మరింత సమాచారం తెలుసుకోండి: