ఈమధ్య డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఎక్కువగా నటిస్తున్నారు నటుడు రాజీవ్ కనకాల. ఆ మధ్య విడుదలైన కానిస్టేబుల్ కనకం వంటి సిరీస్ లో కూడా అద్భుతంగా నటించారు. ఇప్పుడు తాజాగా రాజీవ్ కనకాల కీలకమైన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబడటం లేదు'. ఈ వెబ్ సిరీస్ కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించగా, ఇందులో రాజీవ్ కూతురి పాత్రలో 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ తో ఆకట్టుకున్న వసంతిక నటించారు. అలాగే ఉదయభాను, జెమిని సురేష్, గాయత్రి భార్గవి తదితరు నటీనటులు ఇందులో కీలకమైన పాత్రలో నటించారు. ఆరు ఎపిసోడ్లతో జి5 ఓటిటిలో శుక్రవారం నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రిమింగ్ అవుతోంది. మరి ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.



స్టోరీ విషయానికి వస్తే:
ప్రసాదరావు (రాజీవ్ కనకాల) నెల్లూరు సమీపంలో ఉండే ఓ ఊరిలో పేరున్న వ్యాపారీ, తన కూతురు స్వాతి (వసంతిక) ఒక్కటే బిడ్డ కావడం చేత అల్లారుముద్దుగా పెంచుతాడు .ఆమెకు తండ్రి అంటే భయం, ఏది ధైర్యంగా చెప్పలేదు కష్టపడి చదివి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదిస్తుంది. అయితే తన కూతురిని ఉద్యోగం చేయడానికి ఒప్పుకోరు ప్రసాదరావు. కానీ తండ్రిని ఏదోలా ఒప్పించి ఉద్యోగంలో జాయిన్ అవుతుంది స్వాతి. అలా హైదరాబాదులో భవానీ (గాయత్రి భార్గవి) హాస్టల్లో చేరుతుంది. స్వాతి తన మొదటి జీతాన్ని తండ్రి చేతులో పెట్టాలని ఎంతో ఆశగా ఆఫీస్ కి వెళ్ళగా హాస్టల్ కి తిరిగి డల్ గా వస్తుంది. ఆ తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ అవడంతో కంగారు పడ్డ తండ్రి హైదరాబాద్ కు వచ్చిన ప్రసాదరావుకు కూతురు మిస్సింగ్ అయిందని తెలుస్తుంది. స్వాతి మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ మిస్టరీగా మారుతుంది. ఈ కేసుని సాల్వ్ చేయడానికి రెబకా జోసెఫ్ (ఉదయభాను) ఎంట్రీ ఇస్తుంది. స్వాతి మరణానికి గల కారణమేంటి? హాస్టల్లో ఎదురైన సమస్యలేంటి ఆమె మరణం వెనుక ఉన్న రహస్యాన్ని చేదించారా ?లేదా అనేది కథ.



విశ్లేషణ:
కూతుర్ని ఎంతో ప్రేమించే తండ్రి, తండ్రి పట్ల గౌరవం భయం ఉన్న కూతురు మధ్య బంధాన్ని చాలా అద్భుతంగా చూపించారు. ఈ సినిమా కథకి మర్డర్ మిస్టరీని జోడించారు. ప్రసాదరావు ఫ్లాష్ బ్యాక్ తో స్టోరీ మొదలవుతుంది. స్వాతి మర్డర్ తర్వాత ఉదయభాను ఈ కేసును చేదించే క్రమంలో చాలా ఆసక్తి రేపేల చూపించారు. వెబ్ సిరీస్ మొదటి నుంచే ఏం జరగబోతుందని ఆసక్తి కలిగిస్తుంది. అయితే ఇన్వెస్టిగేషన్లో మాత్రం అక్కడక్కడ కొంత బోరింగ్ కలిగించేలా ఉన్నాయి. తండ్రి పాత్రలో రాజీవ్ కనకాల చేసే ఇన్వెస్టిగేషన్ కూడా ఆసక్తి కలిగిస్తుంది. స్వాతి మరణం వెనుక ఎవరు ఉన్నారు అనే ట్విస్ట్ మాత్రం ఊహించలేరు. ఈ విషయాన్ని డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించారు.


నటీనటుల నటన:
ప్రసాదరావు పాత్రలో రాజీవ్ కనకాల అద్భుతంగా నటించారు. ఇటీవల ఆయన ఎంచుకున్న పాత్రలు చాలా  విస్తృతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆయనకు ఉన్న అనుభవం ఈ వెబ్ సిరీస్ కి చాలా ఉపయోగపడిందని చెప్పవచ్చు. స్వాతి పాత్రలో వసంతిక చాలా అద్భుతంగా నటించింది. ఒక వైపు తండ్రి మీద ప్రేమ భయం, మానసికంగా  నలిగిపోయే పాత్రలో చాలా అద్భుతంగా నటించింది. హాస్టల్ వార్డెన్ గా భార్గవి కూడా బాగానే ఆకట్టుకుంది. పోలీస్ ఆఫీసర్గా రెబకా పాత్రలో ఉదయభాను అద్భుతంగా నటించింది. డైరెక్టర్ కథను నడిపించిన తీరు అద్భుతంగా ఉంది. ఆరు ఎపిసోడ్లకు బదులు కొంచెం ఎడిట్ చేసి ఐదు ఎపిసోడ్లకు కుదించి ఉంటే బాగుండేది. చివరిలో సమాజానికి అవసరమైన మెసేజ్ ని ఇచ్చారు.


రేటింగ్:
2.7/5

మరింత సమాచారం తెలుసుకోండి: