- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

లవ్ డ్రామాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. అందులోనూ  ఎంటర్టైన్మెంట్ లవ్ డ్రామా జానర్స్ కు  ప్రత్యేక ఆదరణ దక్కుతుంది. ప్రస్తుత ట్రెండ్ కు  తగ్గట్టు హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శనివారం గ్రాండ్ గా నూతన చిత్రం ప్రారంభమైంది. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న  మొదటి చిత్రం ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో ఘనంగా  ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు సన్నిహితులు హాజరై విజయాశీస్సులు అందించారు. శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా  తవిటిరాజు తలచింతల వ్యవహరిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ రఘువర్ధన్  కోట్ల దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ముహూర్తపు షాట్ కు  శ్రీధర్ పెద్దిరెడ్డి క్లాప్ కొట్టారు. స్రవంతి  పెద్దిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, శ్రీ హన్సిక పెద్దిరెడ్డి దర్శకుడికి స్క్రిప్ట్ ను అందజేశారు.


ఈ చిత్రంలో యువ జంట జగన్ యోగి రాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ యంగ్ టాలెంట్ తో పాటు సీనియర్ నటులు దేవీ  ప్రసాద్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. లక్ష్మణ్ మీసాల,  పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ..‘‘సినిమా అనేది నాకు ఒక కల. ఒక అభిరుచి. ఒక బాధ్యత. అదే ప్రేమతో ఇప్పుడు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నాను. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నా తొలి చిత్రాన్ని అత్యంత ప్రెస్టేజీయస్‌గా  నిర్మిస్తున్నాం.   మా మొదటి ప్రాజెక్ట్ ఒక అందమైన ఎంటర్‌టైన్‌మెంట్ లవ్ డ్రామా.  ప్రేమ, భావోద్వేగాలు, వినోదం  ఈ మూడు ఎలిమెంట్స్‌తో  ప్రేక్షకులను అలరించేలా ఈ కథను ఎంపిక చేసుకున్నాం. ప్రతి యువకుడి మనసుకు దగ్గరయ్యే భావాలు, ప్రతి కుటుంబం ఆస్వాదించే వినోదం ఈ చిత్రంలో ఉంటాయ‌న్నారు.


మంచి కథకు ప్రాధాన్యం ఇస్తూ, టెక్నికల్‌గా ఉన్నత ప్రమాణాలతో, నాణ్యమైన నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. కొత్త ప్రతిభకు అవకాశం ఇవ్వడమే కాకుండా, అనుభవజ్ఞులైన టెక్నీషియన్ల సహకారంతో ప్రతి ఫ్రేమ్‌ అందంగా  కనిపించేలా కృషి చేస్తున్నాం.  ఈ చిత్రం  నిర్మాతగా తొలి అడుగు మాత్రమే కాదు, భవిష్యత్తులో మరెన్నో మంచి, అర్థవంతమైన చిత్రాలకు  పునాది అవుతుందని నమ్ముతున్నాను. ప్రేక్షకుల ఆశీస్సులు, మీడియా మిత్రుల ప్రోత్సాహం, సినీ పరిశ్రమలోని అందరి సహకారం మా బలం. మీ అందరి ప్రేమాభిమానాలతో ఈ ప్రయాణం విజయవంతం అవుతుందని విశ్వసిస్తున్నాను”అని అన్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు  దర్శకుడు రఘువర్ధన్ కోట్ల తెలియజేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.


ఈ సినిమాలో నటీనటులు జగన్ యోగిరాజ్,  నవ్య చిట్యాల,  దేవీ ప్రసాద్, లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ కాగా ... బ్యానర్ : హన్సి ప్రొడక్షన్స్ , నిర్మాత : శ్రీ హన్సిక పెద్దిరెడ్డి , సహ నిర్మాత : తవిటిరాజు తలచింతల , రచన, దర్శకత్వం : రఘువర్ధన్ కోట్ల , సినిమాటోగ్రాఫర్ : సాయి వంశీ దాచపల్లి ,  
ఎడిటర్‌ : ఉదయకిరణ్ ఏవీ , సంగీత దర్శకుడు : రాజీవ్ రాజ్ , ఆర్ట్ డైరెక్టర్‌గ : శ్రీపాల్ మాచర్ల , లిరిసిస్టులు : నాగేంద్ర గోపు, మనోజ్ జులోరి , ప్రొడక్షన్ కంట్రోలర్‌ : సల్లూరి కరణ్ జోహార్ ,  పీఆర్వో : GK media (పెద్దిరెడ్డి లక్ష్మి గణపతి, వంగాల కుమార స్వామి)

మరింత సమాచారం తెలుసుకోండి: