మేము ఇక్కడ ఉన్నది మా కళ కోసం ,సినిమా కోసం మాత్రమే కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అసభ్యకరమైన యాంగిల్స్ నుంచి ఫోటోలు తీసి మమ్మల్ని చాలా కించపరిచేలా చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదు ఒక వ్యక్తి గౌరవానికి సంబంధించిన విషయం. ఈవెంట్లను కవర్ చేసేవారు వృత్తి నైపుణ్యాన్ని కనీస మర్యాదను పాటించాలంటూ తెలియజేసింది. ఇలాంటి పనులు చేస్తే అసలు మేము సహించము. ఈ విషయంలో మహిళ నటులమంతా కూడా ఐక్యంగానే ఉన్నామంటూ రాసుకుంది.
ఈ అసభ్యకరమైన ధోరణిని ఇకమీదట సాధారణ విషయంగా చూడకూడదని , యాక్టర్స్ నాట్ ఆబ్జెక్ట్స్ (మేము నటులం.. వస్తువులం కాదు) అనే క్యాప్షన్ తో తన ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీని పంచుకుంది. దీంతో మీడియా మిత్రులు జర్నలిస్టులు కూడా తమకు మద్దతుగా నిలవాలని తెలియజేసింది. గతంలో కూడా జాన్వీ కపూర్, నోరా ఫతేహి మరి కొంతమంది హీరోయిన్స్ జూమ్ ఇన్ సంస్కృతి పైన ఫిర్యాదు కూడా చేశారు ఇప్పుడు సప్తమిక కూడా ఈ అంశాన్ని మరొకసారి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యింది. మరి ఈ విషయం పైన నేటిజన్ సైతం మద్దతు పలుకుతున్నారు. ఇలాంటివి జరగకుండా సినీ పరిశ్రమ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి