బుచ్చిబాబు తన గురువు సుకుమార్ లాగే ప్రతి సినిమాను చాలా ప్లాన్డ్ గా చేస్తున్నారు. 'పెద్ది' షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.ఈ సినిమా షూటింగ్ మార్చి మూడవ వారానికి పూర్తి కానుంది. ఏప్రిల్ 30, 2026న గ్రాండ్ రిలీజ్ కి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. 'పెద్ది' ప్రమోషన్ల హడావుడిలో ఉంటూనే, బుచ్చిబాబు తన మూడవ సినిమా కోసం రెబెల్ స్టార్ ప్రభాస్‌ను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా ఒక అదిరిపోయే యాక్షన్ డ్రామాను సిద్ధం చేశారట. త్వరలోనే ప్రభాస్‌కు కథ వినిపించి, ప్రాజెక్ట్ లాక్ చేయాలని చూస్తున్నారు.
ఒకవైపు బుచ్చిబాబు కథతో రెడీగా ఉన్నా, ప్రభాస్ కాల్షీట్లు దొరకడం అంత సులభం కాదు. ప్రస్తుతం ప్రభాస్ ఒకేసారి మూడు భారీ చిత్రాలతో కుస్తీ పడుతున్నారు:ఫౌజీ (Fauji): హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ బిజీగా ఉన్నారు.స్పిరిట్ (Spirit): సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న పోలీస్ డ్రామా ఇది. ఫిబ్రవరి 15 నుంచి ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటున్నారు.కల్కి 2898 AD - సీక్వెల్: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2' షూటింగ్ కూడా ఫిబ్రవరి నుంచే పట్టాలెక్కింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, బుచ్చిబాబు-ప్రభాస్ కలయిక అనేది పూర్తిగా 'పెద్ది' రిజల్ట్ మీద ఆధారపడి ఉంది.'పెద్ది' గనుక బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయితే, బుచ్చిబాబు రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంది. అప్పుడు ప్రభాస్ కూడా ఆయనకు డేట్స్ ఇచ్చే అవకాశం మెండుగా ఉంది. ఏప్రిల్ 30న విడుదల కాబోతున్న 'పెద్ది' చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, జాన్వీ కపూర్ గ్లామర్, చరణ్ మాస్ లుక్ మేజర్ ప్లస్ పాయింట్స్ కానున్నాయి.ఒకవేళ ఈ కాంబినేషన్ కుదిరితే, టాలీవుడ్‌లో మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ మొదలైనట్లేనని అభిమానులు ఆశిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి