విజయ్ దళపతి.. ప్రస్తుతం కోలీవుడ్ మీడియా మొత్తం ఈయన పేరే వినిపిస్తోంది. దానికి ప్రధాన కారణం ఆయన భార్యతో ఈయన తీసుకునే విడాకుల వ్యవహారమే. చాలా రోజుల నుండి సంగీతతో ఎక్కడా కనిపించని విజయ్ దళపతి విడాకులు తీసుకుంటున్నారు అనే ప్రచారం జరిగింది.విజయ్ దళపతి పార్టీ పెట్టిన సమయంలో కూడా భార్య సంగీత రాకపోవడంతో చాలామంది వీరి విడాకుల వార్తలను వైరల్ చేశారు.కానీ సంగీత పిల్లల చదువుల కోసం లండన్ వెళ్లిపోయిందని,అందుకే పార్టీ పెట్టిన రోజు హాజరు కాలేకపోయిందని విజయ్ అభిమానులు కప్పిపుచ్చారు. కానీ నిజం ఏనాడైనా బయటపడక తప్పదు అన్నట్లు విజయ్ దళపతి విడాకుల మేటర్ ఫైనల్ గా బయటికి వచ్చేసింది.విజయ్ దళపతితో విడాకులు కోరుతూ భార్య సంగీత చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో  విడాకులు అప్లై చేసింది. ఈ విడాకుల న్యూస్ కోలీవుడ్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది.

అయితే భర్తతో విడాకులు తీసుకోవడానికి బలమైన కారణాన్ని కూడా అందులో మెన్షన్ చేసింది. సంగీత తన భర్త చాలా రోజుల నుండి ఒక నటితో అక్రమ సంబంధం లో ఉన్నాడని,ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ నటితో ఉన్న అక్రమ సంబంధాన్ని వదులుకోవడం లేదు. అందుకే నేను విడాకులు తీసుకుంటున్నాను అంటూ ఓ షాకింగ్ విషయాన్ని తెలిపింది.దీంతో చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే సంగీత తన భర్త విజయ్ కి ఎఫైర్ ఉందని విడాకుల కి రీజన్ తెలిపింది.అయితే విజయ్ ఎఫైర్  పెట్టుకుంది త్రిష తోనే అనే ప్రచారం జరుగుతుంది.అయితే విజయ్ సంగీతల విడాకులు త్రిష వల్లే అని ఇంత ప్రచారం జరుగుతున్నా కూడా త్రిష దాన్ని ఖండించలేదు.దీంతో ఇది నిజమే అని అందరూ అనుకుంటున్నారు.ఇదిలా ఉంటే తాజాగా కోర్టు మెట్లు ఎక్కడం ఇష్టం లేని విజయ్ దళపతి విడాకుల వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు కోలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
 భార్యతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కకుండా విజయ్ తన భార్యకు ఏకంగా 250 కోట్ల భరణం ఇచ్చి విడాకుల విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి అనుకుంటున్నారట. అయితే ప్రస్తుతం ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ కి కోర్టు మెట్లు  ఎక్కడం కోర్టు చుట్టూ తిరగడం ఇబ్బందిని తెచ్చిపెడుతుంది అనే ఉద్దేశంతోనే భార్యతో విడాకుల మ్యాటర్ ని సామరస్యంగా సెటిల్ చేసుకోవాలని చూస్తున్నారట.అయితే భార్యకి భరణం కింద ₹250 కోట్లు ఇవ్వడానికి కారణం తన ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసమే అని తెలుస్తుంది. తన ఇద్దరు పిల్లల భవిష్యత్తుతో పాటు ఇన్ని రోజులు తనతో కలిసి జీవితం పంచుకున్న భార్య కోసం ఆలోచించి విజయ్ 250 కోట్ల భరణం ఆఫర్ చేసినట్టు సమాచారం. అంతేకాదు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని విజయ్ అనుకున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: