బాలీవుడ్లో పలు టీవీ షోలలో పాల్గొని ఆ తర్వాత బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఆయేషా ఖాన్. నటిగా కూడా తెలుగులో ఓం భీమ్ బుష్, ముఖచిత్రం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మనమే తదితర చిత్రాలలో నటించి మెప్పించింది ఆయేషా ఖాన్. హిందీలో దురంధర్ చిత్రంలో కూడా నటించింది. తాజాగా ఈమె ఓ సమ్మిట్ కి వెళ్ళగా అక్కడ తన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలను తెలియజేసింది.


ఆయేషా ఖాన్ మాట్లాడుతూ.. చాలామంది ఆన్లైన్లో తనని రేప్ చేస్తామంటూ బెదిరించారని, నా నిజజీవితంలో కూడా నాపై రేప్ అటెంప్ట్ చేశారని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయంపై తాను మళ్ళీ ఆలోచించాలనుకోవట్లేదని కొన్ని భయంకరమైన రోజులను తన జీవితంలో నుంచి తొలగించానని మళ్లీ వాటిని గుర్తు చేసుకోవాలనుకోవట్లేదంటూ వెల్లడించింది. ఒకరోజు సినిమా షూటింగ్లో ఉండగా తన ఇంస్టాగ్రామ్ కి రెగ్యులర్గా అసభ్యకరమైన మెసేజ్లు కొన్ని అకౌంట్స్ ద్వారా మెసేజ్ రూపంలో వచ్చేవి. కొన్ని వాయిస్ క్లిప్స్ కూడా పెట్టేవారు. సినిమా షూటింగ్ సెట్లో ఉన్న వాళ్ళే అది చేశారని తెలిసి, అక్కడే ఉన్న మా నాన్నకు టీమ్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వారు చర్యలు తీసుకున్నారని అయితే ఆ వేధింపులు మాత్రం చాలా భయంకరంగా ఉండేవని తెలిపింది.


ఇప్పటికీ కూడా ఆన్లైన్లో రోజు అసభ్యకరమైన పదాలతో తనమీద కామెంట్స్ చేస్తున్నారు. రేప్ చేస్తామంటూ మెసేజ్లు చేస్తూ చాలా బెదిరిస్తున్నారు, ఈ విషయాలను తాను తన మొబైల్ తీసి చూపించగలను ,నేను ఎలాంటి బట్టలు వేసుకున్న ఎలాంటి పోస్టులు చేసిన కొంతమందికి సమస్యగా మారిపోయింది నేను ఏదైనా బట్టలు వేసుకున్నప్పుడు పోస్టులు చేసినప్పుడు వీటిని సె*వల్గానే చూస్తున్నారేమో అనే ఆలోచన కూడా వస్తోంది. ఇలాంటి వారి చుట్టూ ఉండడం చూస్తే తనకు భయం వేస్తోంది అంటూ ఎమోషనల్ గా తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: