ఏంటి ఉస్తాద్ భగత్ సింగ్ టీం దేవిశ్రీప్రసాద్ ని నిజంగానే అవమానించిందా.. ఎందుకు దేవి శ్రీ ప్రసాద్ కి ఉస్తాద్ భగత్ సింగ్ టీం అన్యాయం చేసింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ చివరి వారంలో విడుదలవుతుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా విషయంలో ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 19 కే వస్తుంది అనే ప్రచారం జరుగుతుంది. అయితే మొదట టాక్సిక్ సినిమా విడుదలవుతుంది అనే కారణంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని మార్చి చివరివారానికి వాయిదా వేసుకున్నారు. కానీ పచ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాన్ ఇండియా మూవీ అయినటువంటి టాక్సిక్ సినిమాని వాయిదా వేసుకున్నారు. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి లైన్ క్లియర్ అయ్యింది.

అనుకున్న దానికంటే ముందే ఈ సినిమా విడుదలవబోతోంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే ఈ సినిమాలో మొదట మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీప్రసాద్ ని తీసుకున్నారు. కానీ సడన్గా ఈ సినిమా నుండి దేవిశ్రీని పక్కనపెట్టి తమన్ ని తీసుకోవడంతో దేవిశ్రీ అభిమానులు ఉస్తాద్ భగత్ సింగ్ టీం పై మండిపడుతున్నారు. సర్ జీ సర్ జీ అని పిలుస్తూ డిఎస్పీ కి తీరని అన్యాయం చేశారు అంటూ మండి పడుతున్నారు. అయితే దేవిశ్రీప్రసాద్ స్వయంగా ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు వినిపిస్తోంది.దానికి కారణం దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ పార్ట్ రికార్డింగ్ మొత్తం చేశారట. కానీ సెకండ్ పార్ట్ కి చేయాలనుకునే సమయంలో ఆయన బలగం వేణుతో చేసే ఎల్లమ్మ సినిమాలో బిజీగా ఉన్నారట.

ఇప్పటికే ఎల్లమ్మ సినిమాలో హీరోగా దేవిశ్రీప్రసాద్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి చివరి వారంలో విడుదలైతే దేవి శ్రీ ప్రసాద్ కి డేట్స్ అడ్జస్ట్ అయ్యి ఈ సినిమా మొత్తానికి ఆయనే మ్యూజిక్ అందించేవారు. కానీ ఉస్తాద్  భగత్ సింగ్ సినిమా అనుకున్న దానికంటే ముందే విడుదలకు సిద్ధమవుతుండడంతో డేట్స్ ఖాళీగా లేని దేవిశ్రీప్రసాద్ సినిమా నుండి తప్పుకోవడంతో తమన్ ని ఈ సినిమా కోసం తీసుకున్నారట.. అలా నిస్సహాయ పరిస్థితుల్లోనే దేవిశ్రీని పక్కనపెట్టి తమన్ ని తీసుకున్నారని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సన్నిహితులు చెబుతున్నారు. కానీ డిఎస్పీ అభిమానులు మాత్రం మా అభిమాన మ్యూజిక్ డైరెక్టర్ కి అన్యాయం చేశారు అవమానించారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: