ఏంటి రాంచరణ్ వల్ల నాగబాబు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నారా.. ఇంతకీ నాగబాబు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.. అది కూడా రామ్ చరణ్ వల్ల ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నాగబాబు ఇప్పుడైతే హ్యాపీగా కుటుంబంతో గడుపుతున్నాడు కానీ ఓ సినిమా తీసి చాలా నష్టాలపాలై దివాలా తీసి చివరికి ఉన్న ఆస్తులు అమ్మినా అప్పులు తీరేలా లేని పరిస్థితిలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అంతేకాదు ఆ సమయంలో ఆయనకి ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనలు కూడా వచ్చాయట. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్.. రామ్ చరణ్, జెనీలియా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేమ కొద్ది సంవత్సరాలే ఉంటుంది.లైఫ్ లాంగ్ ప్రేమ ఉండదు అనే పాయింట్ తో తీశారు.

అయితే అప్పటి జనరేషన్ ఈ సినిమాని యాక్సెప్ట్ చేయలేకపోయారు. కానీ ఇప్పటి జనరేషన్ కి ఆరెంజ్ సినిమా చాలా బాగా కనెక్ట్ అయింది. అందుకే ఆరెంజ్ మూవీ విడుదలైన సమయంలో భారీ నష్టాలను తెచ్చి పెట్టినప్పటికీ రీ రిలీజ్ లో మాత్రం ఎన్నో కోట్ల లాభాలు తెచ్చిపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా విడుదలైన మొదటిసారి భారీ డిజాస్టర్ అవ్వడంతో ఈ సినిమాను నిర్మించిన నాగబాబు చాలా అప్పుల్లో కూలిపోయారట. అంతేకాదు తన ఆస్తులు అమ్మినా కూడా అప్పులు తీరే పరిస్థితి లేకపోయేసరికి ఆత్మహత్య చేసుకోవాలి అని ప్రయత్నించారట.

కానీ ఆ సమయంలో తనకి తన అన్నదమ్ములు ఇద్దరు చేయూతగా నిలిచారని, చిరంజీవి,పవన్ కళ్యాణ్ తనకు చాలా సహాయం చేశారని చెప్పుకొచ్చారు.అంతేకాదు ఈ సినిమా లో హీరోగా నటించిన రామ్ చరణ్ కి సగం రెమ్యూనరేషనే ఇచ్చానని మిగతా సగం రెమ్యూనరేషన్ ఇవ్వలేదనే రిగ్రేట్ ఇప్పటికీ ఉంటుందని, కచ్చితంగా రాంచరణ్ కి మిగిలిన రెమ్యూనరేషన్ ఎప్పుడో ఒకసారి తిరిగి ఇస్తాను అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.అలా రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ భారీ డిజాస్టర్ అవ్వడంతో నాగబాబులో సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచనలు వచ్చాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: