గత కొంతకాలంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు పార్కింగ్ వసూళ్లపై కోర్టులో పోరాటం చేస్తున్నాయి. సినిమా చూసేందుకు వచ్చే వారి నుంచి ఫీజు వసూలు చేసే హక్కు తమకు ఉందని వాదించాయి. అయితే, దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది:తాజాగా జరిగిన విచారణ సందర్భంగా గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 121ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద సినిమా టికెట్ ఉన్న ప్రేక్షకులకు పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సమర్థిస్తూ, ప్రేక్షకులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత థియేటర్లదేనని న్యాయస్థానం పేర్కొంది.
థియేటర్‌కు వెళ్తే టికెట్ ధరతో పాటు స్నాక్స్, పార్కింగ్ అంటూ అయ్యే అదనపు ఖర్చుల వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. తాజా తీర్పుతో పార్కింగ్ ఖర్చు మిగలడం ప్రేక్షకులకు పెద్ద ఊరట.పార్కింగ్ టెన్షన్ లేకపోతే జనం థియేటర్లకు వచ్చే అవకాశం పెరుగుతుందని, ఇది బాక్సాఫీస్ వసూళ్లకు కూడా ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఇప్పటికే మల్టీప్లెక్సుల్లో కొన్ని నిమిషాల వరకు ఉచిత పార్కింగ్ సౌకర్యం అమలులో ఉంది. అయితే సింగిల్ స్క్రీన్ల దగ్గర మాత్రం అరాచకం కొనసాగుతోంది. హైకోర్టు తాజా తీర్పుతో ఇకపై యాజమాన్యాలు అక్రమంగా ఫీజు వసూలు చేస్తే లైసెన్సులు రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి