నిరంతరం వేధింపులకు గురి చేస్తూ తన ప్రైవసీకి భంగం కలిగించారనే విషయంపై లావణ్య త్రిపాఠి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా పర్పుల్ క్రేయాన్00 అనే ఖాతా నుంచి గత కొంతకాలంగా లావణ్య త్రిపాఠిని టార్గెట్ చేస్తూ చాలా అసభ్యకరమైన కామెంట్స్ లు చేస్తున్నారని తన క్యారెక్టర్ ను కించపరిచేలా చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా ఈ వివాదంలోకి లాగుతూ ఉండడంతో లావణ్య త్రిపాఠి తీవ్ర ఆగ్రహాన్ని తెలియజేస్తోంది.
కేవలం విమర్శలు చేయడమే కాకుండా అసభ్యతకు పాల్పడడం నేరమని పోలీసుల ద్వారా నిందితులకు బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ సెక్షన్ 67 , భారత న్యాయ సంహిత సెక్షన్ 78,79 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ అకౌంట్ వెనుక ఉన్న వ్యక్తులను ఐపి అడ్రస్ ద్వారా గుర్తించే పనిలో పోలీసులు విచారణ చేయబడుతున్నారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలుపుతున్నారు. గత కొన్నేళ్లుగా సెలబ్రిటీల మీద విమర్శలు చేయడం వారి వ్యక్తిగత విషయాల గురించి అసభ్యకరంగా కామెంట్స్ చేస్తూ ఉండడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. మరి ఈ విషయాల మీద సైబర్ క్రైమ్ పోలీసులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి