డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో హీరోయిన్స్ గా శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 19వ తేదీన విడుదల కాబోతోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉన్న డైరెక్టర్ హరీష్ శంకర్ అప్పుడప్పుడు ఫ్యాన్స్ పెట్టే ట్విట్లకి రిప్లై ఇస్తూ ఉంటారు. అలా నిన్నటి రోజున రాత్రి పవన్ కళ్యాణ్ అభిమాని బాబ్ రికార్డును ఈ సినిమాతో లేపేయాలని పోస్ట్ చేయగా.. అందుకు హరిశంకర్ తధాస్తు అంటూ రిప్లై ఇచ్చారు.


ఆ తర్వాత వెంటనే చూసుకోకుండా వేసిన ట్విట్టర్ ను డిలీట్ చేసిన హరీష్ శంకర్ ను ఈ విషయంపై మహేష్ అభిమానులు మాత్రం  సీరియస్ గా తీసుకొని  హరిశంకర్ ని చాలా దారుణంగా ట్రోల్ చేశారు. వీటికి తోడు కొంతమంది సినిమాని టార్గెట్ చేస్తూ నెగిటివిటీ స్ప్రెడ్ చేసేలా చేస్తూ ఉన్నారు. దీంతో ఈ విషయంపై హరీష్ శంకర్ స్పందిస్తూ మహేష్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెబుతూ మీడియా ద్వారా ఒక లెటర్ ని పోస్ట్ చేయడం జరిగింది.


హరి శంకర్ ఆ లెటర్లో నిన్న నేను చాలా బిజీగా ఉన్నాను సెన్సార్ తర్వాత బోర్డ్ అధికారులతో సమావేశం అయ్యాము, పెద్దమ్మ ఆలయాన్ని కూడా సందర్శించాను, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాను, పాట ప్రోమో కోసం ఫైనల్ గా చెక్ చేసుకున్నాను, థమన్ స్టూడియో కి వెళ్లి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చూసుకున్నారు. మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పాను. ఇలాంటి హడావిడిలో ఒక ట్విట్  తాను పాక్షికంగా మాత్రమే చదివి అనుకోకుండా ట్విట్ చేశాను ఈ విషయంలో నా టీమ్ నన్ను అప్రమత్తం చేసి వెంటనే పూర్తిగా చదవమని చెప్పడంతో తాను చేసిన తప్పును గ్రహించానని తెలిపారు. మహేష్ బాబు గారు పైన నాకు చాలా గౌరవం ఉంది వారణాసి సినిమాతో ఆయన పేరు మీద చాలా రికార్డులు సృష్టించబడతాయని తాను నమ్ముతున్నానని, తాను చేసిన ట్వీట్ ఆయనను లేదా ఆయన అభిమానులను బాధపెట్టాలని ఉద్దేశం తనకు లేదని, మహేష్ పుట్టినరోజున  పోకిరి సినిమాను చేసిన ట్విట్లను కూడా మీరు చూసుకోవచ్చు అంటూ తాను చేసిన పోస్టు వల్ల మహేష్ ఫ్యాన్స్ అభిమానుల మనోభావాలు దెబ్బతీసే ఉంటే నా హృదయపూర్వక క్షమాపణలు అంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: