టాలీవుడ్ చందమామ, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. టీనేజీలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, దాదాపు రెండు దశాబ్దాల పాటు తన గ్లామర్‌తో, నటనతో కుర్రకారును ఊపేసింది. రీసెంట్‌గానే ఇండస్ట్రీలో 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. చివరగా మెగాస్టార్ చిరంజీవి పక్కన ‘భోళా శంకర్’లో మెరిసిన తమన్నాకు, ఇప్పుడు మాస్ రాజా రవితేజ సినిమాలో ఒక పవర్‌ఫుల్ రోల్ దక్కినట్లు సమాచారం.


మాస్ రాజా రవితేజ ఇప్పుడు రూట్ మార్చారు. రొటీన్ మాస్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి, ప్రయోగాత్మక చిత్రాలపై ఫోకస్ పెట్టారు. సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో సర్ప్రైజ్ చేసిన ఆయన, ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు.ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప మాల వేసే ఒక సాదాసీదా మధ్యతరగతి వ్యక్తిగా కనిపించబోతున్నారు. రవితేజ కెరీర్‌లోనే ఇది ఒక విభిన్నమైన పాత్ర కాబోతోంది.గతంలో ‘బెంగాల్ టైగర్’లో రవితేజతో కలిసి గ్లామర్ ఒలకబోసిన తమన్నా, ఇప్పుడు ‘ఇరుముడి’లో ఒక ఇంపార్టెంట్ పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్ చేయబోతోందట. ఇది కేవలం గ్లామర్ పాత్ర కాదని, కథను మలుపు తిప్పే కీలక పాత్ర అని తెలుస్తోంది.



ఈ సినిమాలో తమిళ బ్యూటీ ప్రియ భవానీ శంకర్ రవితేజ భార్యగా నటిస్తోంది. అయితే సెకండ్ లీడ్ లేదా కీలక పాత్రలో తమన్నాను తీసుకోవడం వల్ల సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి ఎమోషనల్ హిట్స్ ఇచ్చిన శివ నిర్వాణ, ఈసారి రవితేజలోని కొత్త కోణాన్ని చూపించబోతున్నారు.గతంలో రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చేసిన మైత్రీ మూవీ మేకర్స్, ఈసారి ఎలాగైనా మాస్ రాజాతో బ్లాక్ బస్టర్ కొట్టాలని ‘ఇరుముడి’ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.



తమన్నా గత ఏడాది ‘ఓదెల-2’లో నటించినా, కమర్షియల్ సినిమాల్లో గ్యాప్ వచ్చింది. ఇప్పుడు రవితేజ సినిమాతో ఆమె మళ్ళీ ఫామ్ లోకి వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా, 2026 ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.ఈ గ్యాప్‌లో మాస్ రాజా తన ‘ఇరుముడి’తో బాక్సాఫీస్ దగ్గర సైలెంట్‌గా రికార్డుల వేట మొదలుపెట్టబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: