మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఈసారి బాక్సాఫీస్ దగ్గర రూట్ మార్చారు. వరుసగా సీరియస్ యాక్షన్ డ్రామాలు చేసిన మెగా ప్రిన్స్, ఇప్పుడు తన ‘మాస్’ మేనరిజమ్స్‌కు కామెడీ అండ్ హారర్ టచ్ ఇచ్చి ‘కొరియన్ కనకరాజు’గా రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొరియాలో శరవేగంగా జరుగుతోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఫైనల్ షెడ్యూల్ కోసం రెడీ అవుతూనే, వరుణ్ అక్కడ చేస్తున్న రచ్చ ఇప్పుడు నెట్టింట ‘పూనకాలు’ తెప్పిస్తోంది.


వరుణ్ తేజ్ తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి.కొరియాలోని స్థానికులతో కలిసి వరుణ్ సరదాగా ముచ్చటిస్తూ, అక్కడి ఫుడ్ అండ్ కల్చర్‌ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రేపటి నుంచి ఈ సినిమా ఫైనల్ అటాక్ (చివరి షెడ్యూల్) మొదలుకానుంది. ఈ ఖాళీ సమయంలో వరుణ్ కొరియన్లతో కలిసి దిగిన సెల్ఫీలు చూస్తుంటే, ‘కనకరాజు’ అక్కడ కూడా తన నెట్‌వర్క్ గట్టిగానే పెంచుకున్నాడని అర్థమవుతోంది.



‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో తన మార్క్ కామెడీని చూపించిన దర్శకుడు మేర్లపాక గాంధీ, ఈసారి వరుణ్ తేజ్‌ను ఒక డిఫరెంట్ అవతారంలో చూపించబోతున్నారు.ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్, టైమింగ్ ఈ సినిమాలో హైలైట్ కాబోతున్నాయని తెలుస్తోంది.
 ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ బ్యూటీ రితికా నాయక్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీ థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించడం ఖాయం.



ఈ సినిమాకు మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఎస్. థమన్.పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు పవర్ ఫుల్ బిజిఎం ఇస్తున్న థమన్, ఇటు ‘కొరియన్ కనకరాజు’కు కూడా అదిరిపోయే సౌండ్ ట్రాక్ ఇస్తున్నారట.యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నరు.

మరింత సమాచారం తెలుసుకోండి: