ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలోని పులివెందుల పరిధిలో జూటూరు గ్రామానికి చెందిన జనార్దన్ గా గుర్తించారు. అయితే ఈ వ్యక్తి గచ్చిబౌలిలోని ఇంద్రానగర్ లోనే ఉంటూ అనసూయను టార్గెట్ చేసుకొని ఏఐ ద్వారా రూపొందించిన కొన్ని నకిలీ వీడియోలను అసభ్యకరమైన వ్యాఖ్యలతో కూడిన పోస్టులను కూడా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఎక్కువగా వ్యూస్ ఫాలోవర్లను పెంచుకోవడం కోసమే జనార్ధన్ ఇలాంటి చర్యలు చేసినట్లుగా తెలియజేశారు. అనసూయ గురించి అనుచిత వ్యాఖ్యలు పెట్టి వ్యక్తిగత ప్రతిష్టను కూడా భంగం కలిగించేలా వ్యవహరించినట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు.
ఈ విషయం పైన అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకొని మరి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించి జనార్ధన్ ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో జనార్ధన్ తాను చేసిన నేరాలను కూడా ఒప్పుకున్నట్లు సమాచారం అయితే ఇదంతా కూడా సోషల్ మీడియాలో పాపులారిటీ వ్యూస్ కోసమే చేశానని సెలబ్రెటీలను లక్ష్యంగా చేసుకొని జనార్ధన్ ఇలాంటివి చేసినట్లుగా తెలియజేశారు. పోలీసులు అదుపులోకి తీసుకొని మరి అతని పైన పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఎవరికైనా నష్టం కలిగించేలా పోస్టులు పెడితే మాత్రం వారి పైన చట్ట పరమైన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి