ఇదంతా ఇలా ఉండగా మార్చి 27న చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మెగా ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా చరణ్ సినిమాల అప్డేట్ కోసం అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రకారం ఈ ఏడాది రామ్ చరణ్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఉండనున్నట్లు టాకు వినిపిస్తోంది. పెద్ది సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ రాబోతున్నట్టు సమాచారం. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా పెద్ది సినిమా టీజర్ ని రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి.
అలాగే డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో కూడా మరో ప్రాజెక్టు చేయడానికి సిద్ధమైన రామ్ చరణ్ ఆర్సి 17 వర్కింగ్ టైటిల్స్ తో ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈసారి మాత్రం రామ్ చరణ్ బర్తడే కు మెగా అభిమానులకు డబుల్ ట్రీట్ ఉండనున్నట్లు వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే రామ్ చరణ్ బర్తడే వరకు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి