ఈ విషయం ఇప్పటికే అటు నిర్మాతలు, కళ్యాణ్ రామ్ కూడా అధికారికంగా ప్రకటించారు. అలాగే ఎన్టీఆర్ తదుపరి సినిమాల విషయానికి వస్తే త్రివిక్రమ్ తో ఒక సినిమా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, వెట్రిమారన్ వంటి తమిళ దర్శకులు కూడా ఎన్టీఆర్ తో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో డ్రాగన్ అయిన తర్వాత అసలు దేవర 2 ఉంటుందా? ఉండదా? అనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. దేవర తర్వాత దేవర 2 సినిమా కోసమే డైరెక్టర్ కొరటాల శివ పని చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. దేవర సినిమా విడుదలై మిక్స్డ్ టాక్ ను సంపాదించుకొని రూ.500 కోట్ల క్లబ్లో చేరింది.
అయితే ఇప్పుడు సీక్వెల్ ను మాత్రం అంతకుమించి తీసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ కూడా పూర్తి అయ్యిందని ఇందులో కొన్ని పవర్ఫుల్ సీన్స్ పొందుపరిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రను మరింత బలంగా చూపించేలా డైరెక్టర్ కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు. కానీ దేవర 2 ఎప్పుడూ ఉంటుందనే విషయం క్లారిటీ రావాలి అంటే మే 20వ తేదీ వరకు ఆకాల్సిందే. ఎందుకంటే అప్పుడు ఎన్టీఆర్ బర్త్డే కాబట్టి తన తదుపరి సినిమాల ప్రకటన వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి