సింగర్ చిన్మయి ఎప్పుడు ఏదో ఒక విషయంలో మాట్లాడుతూ వివాదాస్పదం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లకు జరిగే అన్యాయాల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా నోరు విప్పుతుంది.అయితే అలాంటి సింగర్ చిన్మయి తాజాగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అతని నిజ స్వరూపం పూర్తిగా మీకు తెలియదు కావచ్చు అంటూ సింగర్ చిన్మయి పెట్టిన పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది.మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ గురించి చిన్మయి పెట్టిన ఆ పోస్ట్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.సింగర్ చిన్మయి అతని నిజ స్వరూపం మీకు తెలియదంటూ పవన్ కళ్యాణ్ కి చెప్పింది ఎవరి గురించో కాదు మ్యూజిక్ డైరెక్టర్ కవి అయినటువంటి వైరముత్తు గురించి.. 

తమిళ కవి.. మ్యూజిక్ డైరెక్టర్..అయినటువంటి వైరముత్తు పై లైంగిక ఆరోపణలు చేస్తూ తనని లైంగికంగా వేధించాడని తనని మాత్రమే కాదు తన లాంటి ఎంతో మంది అమ్మాయిలని లైంగికంగా వేధించాడు అంటూ సింగర్ చిన్మయి నోరు విప్పింది. చాలా రోజుల నుండి వైరముత్తుపై చిన్మయి ఆరోపణలు చేస్తూనే ఉంది. వైరముత్తుని ఎవరైనా పొగిడితే చాలు వారికి కౌంటర్లు ఇస్తుంది.అయితే రీసెంట్ గా వైరముత్తుకి జ్ఞానపీఠ అవార్డు రావడం గురించి పలువురు సెలబ్రిటీలు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు.కానీ వారందరికీ సింగర్ చిన్మయి కౌంటర్ ఇస్తూ వస్తోంది.అలా కమల్ హాసన్,రజినీకాంత్ లకి కౌంటర్ ఇచ్చింది.

అయితే ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ కి కూడా కౌంటర్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ జ్ఞానపీఠ అవార్డు వచ్చినందుకు వైరముత్తుకి తన సోషల్ మీడియా ఖాతా నుండి కంగ్రాట్స్ చెప్పగా.. ఈ పోస్ట్ చూసిన చిన్మయి తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టింది. "గౌరవంతో పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం చెబుతున్నాను. అసలు ఆ కవి నిజస్వరూపం ఏంటో మీకు తెలియదని నాకు తెలుసు.. ఆ కవి ఎంతోమంది మహిళలని లైంగికంగా వేధించినందుకు సంపూర్ణ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ విషయం పవన్ కళ్యాణ్ కార్యాలయం ఆయనకి తెలియజేయాలి" అంటూ పోస్ట్ పెట్టింది. అయితే పవన్ కళ్యాణ్ వైరముత్తుని ఉద్దేశించి ఆయనకు జ్ఞానపీఠ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది అని ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని పోస్టు పెట్టడంతో పవన్ కళ్యాణ్ పోస్ట్ కి కౌంటర్గా చిన్మయి ఈ పోస్ట్ పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: