డైరెక్టర్ బుచ్చిబాబు సనా, హీరో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం పెద్ది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పాటలు, పోస్టర్స్, అభిమానుల అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతి అంశం కూడా చాలా స్పెషల్ గా ఉండేలా డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చాలా ప్రత్యేకించి ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి.


సాధారణంగా సినిమాలోని స్పెషల్ సాంగ్ అంటే ఒకరు లేదా ఇద్దరితో కనిపిస్తుంటారు. కానీ బుచ్చిబాబు మాత్రం ఈసారి కొంత డిఫరెంట్ గా ఆలోచించి ఈ పాటలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు లేదా ఐదు మంది క్రేజీ హీరోయిన్స్ తో నటింపచేసేలా ఆలోచిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ఐడియా కనుక వర్క్ అవుట్ అయితే మాత్రం రామ్ చరణ్ పక్కన అంతమంది  హీరోయిన్స్ కలిసి సందడి చేస్తే మాత్రం థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమని చెప్పవచ్చు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.


ప్రస్తుతం పెద్ది సినిమా మొత్తం షూటింగ్ కి సంబంధించి పనులలో బిజీగా ఉన్నారు. ముందుగా పెండింగ్ వరకు పూర్తి చేసిన తర్వాతే ఈ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నాయి. ఈ పాట కోసం ఎవరెవరిని ఎంపిక చేస్తారనే విషయం ఇప్పుడు అభిమానులలో మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తూ ఉండగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుద చేసేలా ప్లాన్ చేస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్లోనే నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సుకుమార్ రైటింగ్ అందించారు. పెద్ది సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి రికార్డులను తిరగా రాస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: