సమంత కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథానాయికగా తన ప్రతిభను రుజువు చేసే విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగారు. అందుకే ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇటీవల తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించిన సమంత, రెండో వివాహం తర్వాత జీవితంను మరింత ఆనందంగా గడుపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని క్షణాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా సమంత తన బెడ్‌రూమ్‌కు సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ ఫోటోలో ఆమె భర్త రాజ్ నిడమోరు ల్యాప్‌టాప్ ముందు కూర్చొని పని చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.
సాధారణంగా బెడ్‌రూమ్ అనేది విశ్రాంతి తీసుకునే ప్రదేశం అయినప్పటికీ, రాజ్ నిడిమోరు మాత్రం అక్కడ కూడా పని పట్ల అంకితభావంతో కనిపించడం గమనార్హం. పడుకోకుండా, ఆఫీస్ పనులను కొనసాగిస్తూ బిజీగా ఉన్న ఆయనను చూస్తే, ఆయన ఎంత కష్టపడి పనిచేస్తారో అర్థమవుతుంది. ఈ ఫోటోను షేర్ చేయడం ద్వారా సమంత తన భర్త హార్డ్‌వర్క్‌ను అభిమానులకు తెలియజేయాలని భావించినట్లు తెలుస్తోంది. కొంతమంది ఇలా బెడ్ రూం పిక్స్ షేర్ చేయరు. కనైఇ సమంత చేసింది. దీంతో ఆమెను నాటీ ఫెలో అంటున్నారు జనాలు. ఇలా వ్యక్తిగత జీవితంలోని చిన్న చిన్న క్షణాలను పంచుకోవడం ద్వారా సమంత తన అభిమానులతో మరింత దగ్గరవుతున్నారు. ఆమె జీవితం, కెరీర్ రెండింటినీ సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతున్న తీరు చాలా మందికి ప్రేరణగా నిలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి