ఇక వేచి చూసే ఓపిక లేదు . ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ‘మాస్’ విశ్వరూపాన్ని చూపించడానికి కేవలం 48 గంటలే మిగిలి ఉంది! హరీష్ శంకర్ మార్క్ డైలాగులు, పవన్ కళ్యాణ్ స్వాగ్ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం జరుగుతుందో ‘గబ్బర్ సింగ్’ నిరూపించింది .. ఇప్పుడు అదే మేజిక్‌ను రిపీట్ చేస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరోసారి హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోయింది . . .


ఈ సినిమాకు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలు అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతను ఎస్‌ఎస్ థమన్ భుజానికెత్తుకున్నారు.థమన్ బిజిఎం పనులను పూర్తి చేసిన సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ ‘హెర్క్యులియన్ ఎఫర్ట్’ అంటూ కొనియాడారు .. థమన్ ఇచ్చే ఆ ‘సౌండ్’ దెబ్బకు థియేటర్లలో సౌండ్ బాక్సులు పేలిపోవాల్సిందేనని మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు . . . ఫైనల్ అవుట్‌పుట్ చూశాక హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ‘ఉస్తాద్’ తన ప్రతాపం చూపడానికి సిద్ధమని హింట్ ఇచ్చారు . . .


మార్చి 19న విడుదల కాబోతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి . .అన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో మొదలయ్యాయి . . . ఇప్పటికే లక్షలాది టిక్కెట్లు అమ్ముడైపోయి, ‘ఉస్తాద్’ స్టామినా ఏంటో చూపిస్తున్నాయి.మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా గ్లామర్ అదనపు ఆకర్షణ కానుంది . . పార్థిబన్, గౌతమి వంటి సీనియర్ నటుల నటన సినిమాకు బలాన్ని చేకూర్చనుంది.పవర్ స్టార్ సినిమా విడుదల అంటే అది ఒక టాలీవుడ్ సెలబ్రేషన్  . . !

మరింత సమాచారం తెలుసుకోండి: