జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న చాలామంది లేడీ కమెడియన్స్ లలో జబర్దస్త్ ఫైమా కూడా ఒకరు. తనదైన కామెడీ టైమింగ్ తో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఫైమా, ఇదే క్రేజీతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6  షోలో కూడా పాల్గొనింది. టైటిల్ గెలవలేకపోయినా అందరినీ ఆకట్టుకుంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలలో కూడా పాల్గొని సందడి చేస్తూ ఉంటుంది  ఫైమా . అయితే తరచూ ఈ మధ్యకాలంలో పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు.


గతంలో ఒక ఇంటర్వ్యూలో ఫైమా మాట్లాడుతూ.. తన సంపాదన ఎంత ,తన ప్రయాణం ఎలా మొదలైంది అనే విషయం పైన ఓపెన్ గానే తెలియజేసింది. బిగ్ బాస్ హౌస్లో సుమారుగా తాను పది వారాలపాటు ఉన్నానని ఒక్కో వారానికి రూ.2 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చారని , అలా సుమారుగా రూ .20 లక్షల రూపాయలపైగా వచ్చినట్లు తెలియజేసింది. అయితే అందులో కూడా పన్నులు, కోతలు కూడా ఉంటాయని వెల్లడించింది ఫైమా. అలా వచ్చిన డబ్బులతో తన కుటుంబమంతా కలిసి ఉండే విధంగా ఒక ఇల్లు కట్టుకున్నానని, అలా ఇల్లు కట్టించడం చాలా ఆనందం ఇచ్చిందంటూ తెలిపింది..

ఒకప్పుడు పండుగలు చేసుకోవడానికి తమ దగ్గర సరిగ్గా డబ్బులు ఉండేవి కాదు, కాని జబర్దస్త్ షో తమ కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఆ షో ద్వారా తాను నెలకి  రూ.3 లక్షలకు పైగా సంపాదిస్తున్నానంటూ వెల్లడించింది. చిన్న వయసు నుంచే తను ఎక్కువగా కష్టాలతోనే పెరిగాను కాబట్టి అందుకే తనకు పెద్దగా ఆర్భాటాలు ఉండడం ఇష్టం లేదని వెల్లడించింది ఫైమా. ఇటీవల తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారనే విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. త్వరలోనే వివాహం చేసుకోబోతోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏడాది ఏదైనా గుడ్ న్యూస్ చెబుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: