పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,డైరెక్టర్ హరి శంకర్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 19వ తేదీన భారీ స్థాయిలో విడుదలయ్యింది. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ,హరిశంకర్ కాంబినేషన్లో ఈ సినిమా అనౌన్స్మెంట్ చేయడంతో అప్పటినుంచి ఈ సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి. ఇక అంచనాలు తగ్గట్టుగానే ఈ సినిమా విడుదలై మిశ్రమ స్పందన రాబట్టింది. ముఖ్యంగా ఇందులో రొటీన్ కథ కావడం చేత బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయినట్లు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. రూ. 37.17 కోట్ల రూపాయల గ్రాస్ నమోదైనట్లు సమాచారం ఇందులో రూ. 31.50 కోట్ల రూపాయల నెట్వర్క్ వసూలు చేసినట్లు సమాచారం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్ మేనరిజంతో ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడిగా శ్రీ లీల, రాశి ఖన్నా నటించారు. అలాగే బాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకున్న దురంధర్ సినిమాకి సీక్వెల్ గా దురంధర్ 2 సినిమా మార్చి 19న విడుదల కావడం చేత ఈ సినిమా కలెక్షన్స్ పైన ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.


ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఇండియా వైడ్ గా 5,359 షోలు వేయగా రూ. 37.17 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఏపీలో పవన్ కళ్యాణ్ స్టామినా  తగ్గట్టుగానే రూ.19.40 కలెక్షన్స్ తో పర్వాలేదు అనిపించింది. తెలంగాణలో మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టలేదని అక్కడి కేవలం రూ. 9.10 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టినట్లుగా వినిపిస్తున్నాయి. మరి ఫైనల్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అఫీషియల్ గా చిత్ర బృందం కలెక్షన్స్ పైన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: