మణిరత్నం తన సొంత బ్యానర్ ‘మద్రాస్ టాకీస్’పై నిర్మిస్తున్న 23వ చిత్రమిది. ఇందులో హీరోగా వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి నటిస్తుండగా, హీరోయిన్‌గా గ్లోబల్ లెవల్ క్రేజ్ ఉన్న సాయి పల్లవి ఫిక్స్ అయ్యారు.సాయి పల్లవి టాలెంట్‌ను గుర్తించి ఆమెకు అవకాశం ఇస్తానని చెప్పిన మాటను మణిరత్నం నిలబెట్టుకోవడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.గతంలో ‘నవాబ్’ (చెక్క చివంత వానం) సినిమాలో విజయ్ సేతుపతితో కలిసి పనిచేసిన మణిరత్నం, ఇప్పుడు మరోసారి ఆయనలోని నటుడిని కొత్తగా చూపించబోతున్నారు.
మణిరత్నం కెరీర్‌లో ఇటీవల ‘థగ్ లైఫ్’ సినిమా ఒక పెద్ద మచ్చగా మిగిలిపోయింది. కమల్ హాసన్, శింబు వంటి స్టార్స్ ఉన్నా ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అవ్వడమే కాకుండా, వివాదాల వల్ల చాలా చోట్ల రిలీజ్ కూడా కాలేదు.‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 1 & 2 లతో బాక్సాఫీస్ దగ్గర వేల కోట్లు కొల్లగొట్టిన మణిరత్నం.. ఇప్పుడు విజయ్ సేతుపతి, సాయి పల్లవి సినిమాతో మళ్ళీ తన ఫామ్‌లోకి రావాలని కసితో ఉన్నారు. ప్రస్తుతం రణబీర్ కపూర్ సరసన ‘రామాయణం’లో సీతగా నటిస్తూ బిజీగా ఉన్న సాయి పల్లవి, ఆ ప్రాజెక్ట్ అవ్వగానే మణిరత్నం సెట్స్‌లో జాయిన్ కానుంది.మణిరత్నం సినిమా ప్రకటన రావడంతో సౌత్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతోంది.పర్ఫార్మెన్స్ బాక్సాఫీస్ దగ్గర మణిరత్నం తన క్లాసిక్ టచ్‌తో మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి