నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు శ్రీలీల కంటే ముందు మరో స్టార్ హీరోయిన్‌ను అనుకున్నారట. హరీష్ శంకర్ తన ‘డీజే’ హీరోయిన్ పూజా హెగ్డేను ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకోవాలని ప్లాన్ చేశారు. కానీ ఆ సమయంలో పూజా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ ‘పవర్’ఫుల్ ఛాన్స్‌ను వదులుకోవాల్సి వచ్చింది.పూజా ప్లేస్‌లోకి వచ్చిన శ్రీలీల, తన ‘లీల’ అనే రేడియో జాకీ పాత్రతో ప్రేక్షకులను మాయ చేసింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథ మొత్తం ఆమె చుట్టూనే తిరగడం, పవన్ కళ్యాణ్ పక్కన ధీటుగా నటించడం చూస్తుంటే పూజా హెగ్డే ఒక మంచి సక్సెస్‌ను మిస్ చేసుకుందనే చెప్పాలి.
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఐకానిక్ సాంగ్ అయిన ‘తొలిప్రేమ’లోని ‘ఈ మనసే’ పాటను ఈ సినిమాలో రీమిక్స్ చేశారు. పవన్-శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చే ఈ సాంగ్ ప్రేక్షకులకు కంటి పండుగలా ఉంది. శ్రీలీల గ్రేస్, పవన్ స్వాగ్ కలిస్తే థియేటర్లలో విజిల్స్ పడాల్సిందే! గత సినిమాలతో పోలిస్తే శ్రీలీలకు ఈ మూవీలో మంచి స్క్రీన్ స్పేస్ దక్కింది. రాశీ ఖన్నా కంటే శ్రీలీల పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటం ఆమెకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది.పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం థియేటర్ల దగ్గర ‘ఉస్తాద్’ జాతరను ఎంజాయ్ చేస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన వినిపిస్తున్నా, కలెక్షన్ల పరంగా మాత్రం పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో అర్థమవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి