కల్కి సినిమాలో నటించిన దీపికా పదుకొనే కూడా ఈ సినిమా సీక్వెల్ నుంచి చిత్ర బృందం తప్పించిన సంగతి తెలిసిందే. దీంతో అసలు సీక్వెల్ ఉంటుందా? ఉండదా , దీపికా పాత్రలో ఎవరిని తీసుకువస్తారనే విషయంపై అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ లేకుండా కొన్ని సీన్స్ తెరకెక్కించారని ముఖ్యంగా కమలహాసన్, అమితాబ్ బచ్చన్ , దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ ఇందులో కనిపించారు. ఇప్పుడు ఈ సినిమాలోకి మరో స్టార్ హీరో బాగమయ్యారని వినిపిస్తోంది.
కల్కి 2 చిత్రంలోకి సీనియర్ హీరోగా పేరు సంపాదించిన జె.డి చక్రవర్తి నటించబోతున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు.కానీ ఈ సినిమాలో ఆయన ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారని టాప్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి మరి. త్వరలోనే ప్రభాస్ సినిమా షూటింగ్ సెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే దీపికా పాత్ర కోసం ఏ హీరోయిన్ ని ఎంపిక చేస్తారో చూడాలి మరి. ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే స్పిరిట్ సినిమా, ఫౌజీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి