తాజాగా డైరెక్టర్ సనోజ్ మిశ్రా పైన మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ సెట్లో సనోజ్ మిశ్రా తన పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించే వారిని చాలాసార్లు శరీర భాగాలను తాకూతూ వేధించేవారని ఆమె ఎమోషనల్ గా మాట్లాడింది. ఈ చేదు సంఘటనలు ఎదురైన సమయంలో తాను ఇంట్లో వారితో చెప్పిన పట్టించుకోలేదని,అది తన మొదటి సినిమా కావడంతో సర్దుకుపోవాలని చెప్పారని తెలిపింది. ఆ సమయంలో తాను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారంటూ మోనాలీసా వెల్లడించింది. ఈ విషయాలన్నీ కొచ్చిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ విషయాలను బయటపెట్టింది మోనాలిసా.
అంతేకాకుండా తన వయసు ఆ సమయంలో 18 సంవత్సరాలు మాత్రమేనని అందుకే తాను ఎక్కడ కూడా ఈ విషయాలను బయటకు చెప్పలేక సైలెంట్ గా ఉండిపోయానని. తన భర్త ఫర్మాన్ ఖాన్ తో కలిసి ప్రెస్ మీట్లో ఇటీవల పాల్గొని వీరిద్దరీ వివాహం ఇష్టపూర్వకంగానే కేరళలో జరిగిందని తాము కేరళలో నివసిస్తున్నామని, తమ స్వస్థలానికి తిరిగి వెళ్లాలనుకున్న అక్కడ పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని తమకు ప్రాణహాని ఉందని, అందుకే తమ జీవితాన్ని భయాందోళన మధ్య గడుపుతున్నట్లుగా తెలియజేసింది. త్వరలోనే ఈ విషయం పైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామంటూ తెలియజేసింది మోనాలీసా. మరి డైరెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి