నల్లకోడి చూడడానికి నల్లగా ఉన్న , ఈ కోడి తినడం కోసం జనాలు మాత్రం ఎగబడుతుంటారు. ఇది చాలా ధరతో కూడిన కోడి మాంసం. ఈ మాంసంలో ఎక్కువగా పోషకాలే ఉంటాయి. నల్లకోడిలో మన శరీరానికి కావాల్సిన పోషక విలువలు కూడా చాలానే లభిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల ఇవి శరీరంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను తగ్గిస్తాయి. అలాగే ఇమ్యూనిటీ పవర్ ని కూడా పెంచడంలో చాలా ఉపయోగపడతాయి. ఈ కోడిలో చాలా తక్కువగా కొవ్వు కలిగి ఉండడం వల్ల గుండె జబ్బులు గుండెపోటు రాకుండా చేస్తుంది
అలాగే ఆస్తమా రోగులకు కూడా బెస్ట్ మెడిసిన్గా ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కోడి నల్లగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ కూడా ఎక్కువగానే లభిస్తుంది. ఈ కోడిని పోషక విలువలు ఎక్కువగా ఉండడం వల్ల నల్ల బంగారం అని కూడా పిలుస్తారు. అయితే ఈ కోళ్లు పెరగడానికి కొంత ఎక్కువ సమయమే తీసుకుంటాయి. గుడ్లు తక్కువ పెడతాయి. సాధారణంగా కోడి మాంసం ధర కేజీ రూ.200నుంచి రూ .300 మధ్యలో ఉన్నప్పటికీ ఈ నల్లకోడి మాంసం ధర సుమారుగా రూ .800 నుంచి రూ.1000 రూపాయలకు పైగే పలుకుతోంది. అందుకే ఈ మధ్యకాలంలో తరచూ ఎక్కడ చూసినా ఈ కోళ్ల పెంపకం కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి