టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ సుకుమార్, కృతి సనన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం నేనొక్కడినే. ఈ సినిమా 2014లో భారీ అంచనాల మధ్య విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే వాస్తవంగా ఈ సినిమా స్టోరీ పరంగా బాగున్నప్పటికీ చూపించే విధానం ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. అయితే ఈ సినిమా ఫెయిల్యూర్ పైన ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ సుకుమార్ అసలు విషయాన్ని బయటపెట్టారు.


సుకుమార్ మాట్లాడుతూ నేను చేసిన ఒకే ఒక తప్పు 1 నేనొక్కడే సినిమా ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలే పోయింది. నిజానికి ఈ సినిమా స్టోరీ రాసిన తర్వాత మేము రెండు రకాలుగా స్క్రీన్ ప్లే అనుకున్నాము.. మొదటి వర్షన్ ఇంటర్వెల్  వచ్చేసరికి హీరోకు ఎలాంటి లోపం ఉంది అనేది చూపించాలనుకున్నాము. అందులోనే ఒక నాటకం ఆడుతూ అందరిని మోసం చేసినట్లుగా చూపించాలని అనుకున్నాం, మరో వర్షన్ మాత్రం ఇప్పుడు ప్రేక్షకులు చూసిన విధంగానే ఉంటుంది. హీరోకి ఎలాంటి వ్యాధి లేదని మోసం చేసినట్లుగా చూపిస్తే ప్రేక్షకులకు ఫీల్ రాదేమో అని ఉద్దేశంతోనే ప్రస్తుతం ఉన్న స్క్రీన్ ప్లే ని అలాగే చూపించామని తెలిపారు


అయితే మేము అనుకున్న ఆ రెండో రకం వర్షన్ పూర్తిగా షూట్ చేసి రెండు వర్షన్లను పక్కన చూసుకొని మరి నిర్ణయం తీసుకొని ఉంటే మా అభిప్రాయం ఏమైనా మారేదేమో అలా చేసి ఉంటే మరింత ఫలితం మెరుగ్గా ఉండేదేమో అని ఆ తర్వాత అనిపించిందని సుకుమార్ తెలియజేశారు. అయితే మొదట విడుదలైన సమయంలో బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా టీవీలలో మాత్రం ప్రేక్షకులను మరింత ఆదరణ సంపాదించుకుందని తెలియజేశారు. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రంలో నాజర్ నటించిన విలన్ పాత్ర అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ ని ఒక విభిన్నమైన పాత్రలో చూపించారు డైరెక్టర్ సుకుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: