డైరెక్టర్ హరి శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ సినిమా వచ్చి ఎలాంటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో రెండవ సినిమా 2026 మార్చి 19న ఉగాది కానుకగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. అలాగే కోలీవుడ్ నటుడు పార్తీబన్ విలన్ గా నటించారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ స్టైల్, యాక్షన్ ,మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.



ఈ సినిమాలో కొన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కథ లేకపోవడంతో ఈ సినిమా మిక్స్డ్ టాకును సంపాదించుకుంది. వీటికి తోడు వారి హైప్ ఉన్న దురందర్ 2 చిత్రం కూడా విడుదల కావడం చేత పవన్ కళ్యాణ్ సినిమాకి మైనస్ గా మారింది. కలెక్షన్స్ కూడా అంతంత మాత్రమే రాబట్టింది. అయితే ఇప్పుడు ఓటిటి స్ట్రీమ్మింగ్ గురించి ఒక విషయం వైరల్ గా మారింది. సినిమా రిలీజ్ కి ముందే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డిజిటల్ స్ట్రిమింగ్ రైట్స్ భారీ ధరకే అమ్ముడుపోయాయి. ఈ సినిమాని నెట్ ఫ్లిక్ భారీ ధరకే సొంతం చేసుకున్నట్లు సమాచారం.


సుమారు 5 వారాల గ్యాప్ తోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓటీటిలోకి వస్తుంది. అంటే ఏప్రిల్ 15 లేదా 24న స్ట్రిమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. థియేటర్లలో రన్ ను బట్టి ఈ తేదీలో మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. థియేటర్లో మిక్స్డ్ టాక్స్ సంపాదించుకున్న ఈ చిత్రం మరి ఓటీటిలో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి. పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాల విషయంలో కూడా కేవలం రూమర్స్ మాత్రమే వినిపిస్తున్నాయి అఫీషియల్ గా మాత్రం ఎటువంటి చిత్రాలను ప్రకటించలేదు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం రాజకీయాల వైఫై పెట్టినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: