మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రాలలో సోసియో ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం విశ్వంభర. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ఠ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా విఎఫ్ఎక్స్ కారణంగా ట్రోల్స్ ఎదుర్కొంటోంది. ఈ సినిమా సంబంధించి గ్లింప్స్ విడుదల చేయగా అందులో చూపించిన విజువల్స్ అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే విఎఫ్ఎక్స్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలని చిరంజీవి సలహా ఇవ్వడంతో ఆలస్యం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే చిత్ర బృందం ఇప్పటివరకు ఈ సినిమా పైన ఎలాంటి అప్డేట్ మాత్రం ప్రకటించలేదు. కానీ ఇప్పుడు తాజాగా సైలెంట్ గా ఒక భారీ ప్లాన్ చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా పైన ఇప్పటివరకు పెద్దగా హైప్ లేదనే విషయం నిజమే అయిన ట్రైలర్ విడుదల అయ్యిందంటే సీన్ మొత్తం మారిపోతుందంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి అందుకే ట్రైలర్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నట్లు వినిపిస్తున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ నిర్మాతలు చూసి ఇందులో కొన్ని సీన్స్ అంచనాలకు మించి అద్భుతంగా వచ్చినట్లు మాట్లాడుకున్నట్లుగా వినిపిస్తున్నాయి.


ఆ సీన్స్ ని ఏరి కోరి మరి ట్రైలర్లో పొందుపరిచేలా ప్లాన్ చేస్తున్నారు. గత కొంతకాలంగా విశ్వంభర సినిమా గురించి మాట్లాడలేదని అభిమానులు  నిరాశతో ఉన్నారు. కానీ రాబోయే ట్రైలర్ తో మాత్రం ఏమాత్రం నిరాశ చందరనే విధంగా వినిపిస్తున్నాయి. ట్రైలర్ తో విశ్వంభర మేనియా మొదలవ్వడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలలో కూడా వినిపిస్తున్నాయి. ట్రైలర్ తోనే సినిమా రేంజ్ మారిపోతుందని, వాస్తవంగా శ్రీరామనవమి పండుగ సందర్భంగా  అప్డేట్ ఇవ్వాలని మేకర్స్ అనుకున్నప్పటికీ.. రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాకు సంబంధించి గ్లింప్స్ విడుదల చేయడంతో విశ్వంభర టీమ్ వెనక్కి తగ్గినట్లుగా వినిపిస్తున్నాయి. మరి సరైన సమయంలో ట్రైలర్ విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతొందట.

మరింత సమాచారం తెలుసుకోండి: