ఈ సినిమా ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ సందడి చేయడంతో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. నిహారిక కొణిదెల ఈసారి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో ఈ స్పోర్ట్స్ డ్రామాను నిర్మిస్తున్నారు. విలేజ్ నేటివిటీతో సాగే ఈ కథలో ఎమోషన్స్, యాక్షన్ పీక్స్ లో ఉంటాయని టాక్.షూటింగ్ మొదలైన రోజే రిలీజ్ డేట్ ప్రకటించి చిత్ర బృందం అందరినీ ఆశ్చర్యపరిచింది. 2027 సంక్రాంతి బరిలో నిలుస్తామని అఫీషియల్‌గా చెప్పేయడంతో బాక్సాఫీస్ దగ్గర అప్పుడే యుద్ధ వాతావరణం మొదలైంది.
వరుణ్ తేజ్ ‘బరి’లోకి దిగుతున్నాడని తెలియగానే, పండగ సీజన్ కోసం కర్చీఫ్ వేసిన ఇతర స్టార్ల లిస్ట్ కూడా బయటకొచ్చింది. 2027 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర ఊచకోత తప్పేలా లేదు!అనిల్ రావిపూడి - వెంకటేష్ - కళ్యాణ్ రామ్: ఇప్పటికే అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్టైనర్‌తో సంక్రాంతికి వస్తున్నట్లు హింట్ ఇచ్చారు. ఒకవేళ బాబీ కొల్లి సినిమా ఈ ఏడాది మిస్ అయితే, చిరు కూడా ఫెస్టివల్ సెంటిమెంట్‌తో పండగకే దిగే ఛాన్స్ ఉంది.
బాలయ్య - గోపీచంద్ మలినేని: దసరా, దీపావళి మిస్ అయితే నటసింహం బాలకృష్ణ తన ‘మాస్’ గర్జనతో సంక్రాంతి బరిలోకి రావడం ఖాయం.శర్వానంద్ & నితిన్: శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్, నితిన్ ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ సినిమాలు కూడా ఇదే రేసులో ఉన్నాయి.నాగార్జున ‘బంగార్రాజు’: అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘సోగ్గాడే చిన్నినాయన’ సిరీస్ మూడో భాగం కూడా పండగకే వస్తుందని టాక్.అయినా కంటెంట్ బాగుంటే ఏ సీజనైనా ఒకటే కానీ జనవరిలో వసూళ్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి దాన్ని లక్ష్యంగా పెట్టుకునే వాళ్ళు ఎక్కువవుతున్నారు. చూడాలి మరి బరి ఏం చేస్తుందో.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి