హనీ రోజ్ ఒక మాల్ ఓపెనింగ్‌కు రాగానే వేలాది మంది అభిమానులు ఆమెను చూడటానికి ఎగబడ్డారు. ఫోటోలు, సెల్ఫీల కోసం ఫ్యాన్స్ పోటీ పడుతున్న సమయంలో, ఒక వ్యక్తి అత్యుత్సాహంతో ఆమెకు తెలియకుండానే నడుముపై చేయి వేశాడు . . ఈ దృశ్యం కెమెరాకు చిక్కడంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది.తనను అలా తాకినా కూడా హనీ రోజ్ ఏమాత్రం అసహనం వ్యక్తం చేయకుండా, ఎంతో హుందాగా చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు . . అయితే, ఆమె ప్రశాంతంగా ఉన్నా నెటిజన్లు మాత్రం “అభిమానం అంటే గౌరవించడం. . . ఇలా అసభ్యంగా తాకడం కాదు” అంటూ సదరు వ్యక్తిపై విరుచుకుపడుతున్నారు. .
గతంలో ప్రభాస్ ‘రాజా సాబ్’ ప్రమోషన్స్ కోసం మాల్‌కి వెళ్ళినప్పుడు హీరోయిన్ నిధి అగర్వాల్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఎంతమంది బౌన్సర్లు ఉన్నా, జనం రద్దీలో హీరోయిన్ల పర్సనల్ స్పేస్‌ను కాపాడటం కష్టమవుతోంది. . ఫోటోల కోసం సెలబ్రిటీలను తాకడానికి ప్రయత్నించడం ఒక ‘వ్యాధి’లా మారుతోందని విమర్శలు వస్తున్నాయి.అభిమానం హద్దుల్లో ఉంటేనే అందం . . ఒక నటిని గౌరవించడం నేర్చుకోవాలని, సెలబ్రిటీల ప్రైవసీని కాపాడాలని సామాజిక మాధ్యమాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి.హనీ రోజ్ వీడియో ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌లో ఉంది.సినిమాలు చేస్తోంది తక్కువే అయినా, సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి