ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొనడం కూడా అందరిని మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తనదైన స్టైల్ లుక్ లో బైక్ పైన వచ్చి మిర్చి సినిమాలోని డైలాగులు చెబుతూ "కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్" అంటూ చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు ప్రభాస్ నుంచి ఇలాంటి సపోర్టు వీడియో రావడంతో అటు హీరో శర్వానంద్ కూడా ఎమోషనల్ గా థాంక్యూ ప్రభాస్ అన్న అంటూ నీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ నాపై ఉండడం నా అదృష్టం మన బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలనుకుంటున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఈ విషయం అటు ప్రభాస్ అభిమానులు శర్వానంద్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తున్నారు. ప్రభాస్ చేసిన ఈ చిన్న వీడియో ఇప్పుడు బైకర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. ఏప్రిల్ మూడవ తేదీన అన్ని భాషలలో చాలా గ్రాండ్గా ఈ సినిమా విడుదల కాబోతోంది. శర్వానంద్ కెరీర్ లోనే ఇదొక విభిన్నమైన సినిమాగా ఉండనున్నట్లు సినీ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా గా వస్తున్న ఈ సినిమా మరి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి మరి. శర్వానంద్ షేర్ చేసిన ఈ ట్వీట్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి