హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’ (Fauji) మరియు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ (Spirit) చిత్రాల షూటింగ్‌లతో ప్రభాస్ గత కొన్ని నెలలుగా విపరీతమైన బిజీగా ఉన్నారు.నిర్విరామంగా పని చేస్తున్న ప్రభాస్, కొంచెం ‘పర్సనల్ స్పేస్’ కోసం తాజాగా బేగంపేట విమానాశ్రయం నుండి ఇటలీకి వెకేషన్‌కు బయలుదేరారు. వేసవి సెలవుల కోసం వెళ్తున్న ఆయన, కొద్ది రోజులు అక్కడే ఉండి ప్రకృతి ఒడిలో రీఛార్జ్ అవ్వనున్నారు.కొన్ని రోజులు వెకేషన్ ఎంజాయ్ చేసిన తర్వాత ప్రభాస్ తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. విరామం తర్వాత ఆయన ‘కల్కి 2898 AD’ సీక్వెల్ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని టాక్.
ప్రభాస్ లైనప్ చూస్తుంటేనే ట్రేడ్ వర్గాలకు చెమటలు పడుతున్నాయి.
1.ఫౌజీ
హను రాఘవపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ పిరియడ్ యాక్షన్ డ్రామా ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో ప్రభాస్ ఒక ఆర్మీ ఆఫీసర్‌గా తన విశ్వరూపం చూపించబోతున్నారు.
2.స్పిరిట్
సందీప్ రెడ్డి వంగా - ప్రభాస్ కాంబో అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ ‘హై-వోల్టేజ్’ పోలీస్ యాక్షన్ డ్రామా మార్చి 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ‘యానిమల్’ రేంజ్ ఊచకోత కోయడం ఖాయం.
3.కల్కి
కల్కి సీక్వెల్: ‘కల్కి 2898 AD’ సంచలన విజయం తర్వాత సీక్వెల్ షూటింగ్ అప్పుడే మొదలైనప్పటికీ, దాని విడుదల తేదీపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఈ చిన్న విరామం తర్వాత ప్రభాస్ మళ్ళీ వరుస సినిమాలతో బిజీ కానున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి