ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణం సినిమా టీజర్ ని తాజాగా చిత్ర బృందం విడుదల చేశారు. రామాయణ గ్లింప్స్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. రాముడిగా రణబీర్ కపూర్ అద్భుతంగా నటించినట్లు కనిపిస్తోంది రణబీర్ కపూర్. అలాగే సాయి పల్లవి సీత పాత్రలో అద్భుతంగా కనిపించింది. రామాయణ సినిమాకి విఎఫ్ఎక్స్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ సంస్థ డిఎన్ఈజీ ఈ చిత్రానికి గ్రాఫిక్స్ డిజైన్ గా పనిచేస్తోంది.
ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు రామాయణ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి గ్లింప్స్ అందరిని ఆకట్టుకుంటోంది. రెండవ భాగం 2027 దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. తెలుగు వర్షన్ డైలాగులు బాధ్యత ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్కు అప్పగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ తో పాటు హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మోర్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి మిగిలిన నటీనటుల పై మరిన్ని అప్డేట్స్ విడుదల చేస్తారేమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి