టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ వివాహమానంతరం సినిమాలకు దూరమై సీనియర్ హీరోలకు జోడిగా నటిస్తోంది. ఈ మధ్యనే పలు భారీ ప్రాజెక్టులతో బిజీ హీరోయిన్గా మారిపోయింది. అలా భగవంత్ కేసరి, కన్నప్ప వంటి చిత్రాలలో నటించింది. అయితే ఇప్పుడు ఇండియన్ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రమైన రామాయణ చిత్రంలో భాగమైనట్లుగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు.


ఈ పారాణిక గాథలో కాజల్ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా ఈ చిత్రంలో కాజల్ రావణాసురుడి భార్యగా మండోదరి పాత్ర లో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కాజల్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఆ వార్తలను నిజం చేస్తూ రామాయణ గ్లింప్స్ షేర్ చేస్తూ "ప్రతితరం శ్రీరాముడు పేరుతోనే పెరిగారు ఇప్పుడు యావత్ ప్రపంచం కూడా మర్యాద పురుషోత్తముడైన ఆ రాముడుని దర్శించుకోనుంది ఇలాంటి గొప్ప సినిమాలో తాను భాగమైనందుకు చాలా గర్వపడుతున్నానంటూ రాసుకోచ్చింది".




ఈ విషయం పైన కాజల్ అభిమానులు కూడా అభినందిస్తున్నారు. కాజల్ యాక్టింగ్ పైన కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో గ్రాఫిక్స్ లో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నట్లు అద్భుతమైన ప్రశంసలు అందుకుంటోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీడియోల్, రావణాసురుడిగా యష్ నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇక రెండవ భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: