టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా సెలబ్రిటీల సైతం బ్యాచిలర్ లైఫ్ ను వీడి వివాహం వైపుగా అడుగులు వేస్తున్నారు. అలా ఇప్పటికే రష్మిక ,విజయ్ దేవరకొండ వివాహం చేసుకోగా అల్లు శిరీష్ కూడా ఇటీవల వివాహం చేసుకున్నారు.. నిన్నటి రోజున బండ్ల గణేష్ కూతురు ఎంగేజ్మెంట్ కూడా చాలా సింపుల్ గా చేశారు. ఇప్పుడు తాజాగా మరో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. మార్చి 8వ తేదీన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి తో రోకా ఈవెంట్ చేసుకున్నారు. దీంతో వీరి వివాహ తేదీ పైన పలు రకాల రూమర్స్ వినిపించాయి.


తాజాగా వీరీ పెళ్లి డేట్ తో పాటు ఎంగేజ్మెంట్ డేట్ ని కూడా ప్రకటించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి ఎంగేజ్మెంట్ ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాదులో జరగనుంది. ఇక వీరి వివాహం మాత్రం తిరుపతిలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏప్రిల్ 29న కేవలం ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేసుకోబోతున్నారు. అనంతరం మే లో హైదరాబాదులో చాలా గ్రాండ్గా రిసెప్షన్ వేడుక ఉండవచ్చని వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసిన అభిమానులు సైతం ఈ జంటకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చేసుకోబోయే అమ్మాయి కావ్య రెడ్డి తండ్రి లాయర్ వీళ్ళ ఫ్యామిలీలో కూడా చాలామంది లాయర్లు ఉన్నట్లుగా సమాచారం. సాయి శ్రీనివాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హైందవం, టైసన్ నాయుడు వంటి చిత్రాలు ఉన్నాయి.చివరిగా భైరవం, కిష్కిందపురి వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. మాస్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు తన లైఫ్ లో మరో ముందడుగు వేస్తున్నారు. మరి వివాహం అనంతరం సినిమాల విషయంలో మరింత ముందడుగు వేస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: