ఇప్పటివరకు ఈ చిత్రం ఇండియాలో రూ .71 కోట్ల రూపాయల నెట్ షేర్, రూ .83 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా రూ.95 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాలలో కూడా దాదాపుగా నష్టాలనే మిగిల్చింది. దాదాపుగా ఉస్తాద్ భగత్ సింగ్ థియేట్రికల్ రన్ ముగిసినట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ టార్గెట్లో సగం కూడా రికవరీ చేయలేకపోయినట్లు వినిపిస్తోంది.
దీంతో ఈ సినిమా నిర్మాతలకు రూ .70 కోట్లకు పైగా నష్టాలు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక ఓటిటి రైట్స్, సాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా మేకర్స్ కి కొంతవరకు సేఫ్ జోన్ లో ఉండే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలిపోయో అవకాశం ఉంది. మరోవైపు రాజకీయాలలో కూడా బిజీగా ఉండడంతో ప్రస్తుతం అయితే సినిమాల కంటే రాజకీయాల వైపే పవన్ కళ్యాణ్ ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అందుకే తదుపరి సినిమాల విషయంలో కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి