ఆ సమయంలో తన స్నేహితురాలు ఈ విషయాన్ని చెప్పే వరకు తనకు తెలియదని తీరా ఆ ఫోటో చూసి నేనే షాక్ అయ్యాను. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక చాలా బాధపడ్డాను అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది. చిన్న వయసులోనే సోషల్ మీడియాలో కనీస నైతికత ఉండదని తనకు అర్థమయిందని భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని అప్పుడే మానసికంగా సిద్ధమయ్యానంటూ తెలిపింది జాన్వీ కపూర్. ఇప్పుడు తనపై వస్తున్న డీప్ ఫేక్ ఫోటోలు లేదా ఇతర నేటివ్ కామెంట్స్ లను తాను పెద్దగా పట్టించుకోలేదంటూ క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సెలబ్రెటీలు ఇలాంటి సమస్యలను చాలా ఎదుర్కోవాల్సి వస్తుందని వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కోవడమే అసలైన సవాల్ అంటూ తెలిపింది. జాన్వీ కపూర్ చేసిన ఈ కామెంట్స్ కి నెటిజెన్స్ సైతం అభినందిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఇలాంటి చేదు అనుభవాలను పంచుకోవడం వల్ల తోటి యువతకు , మహిళలు ధైర్యంగా ఇలాంటివి జరిగితే ఎదుర్కోవాలని సలహా ఇస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. జాన్వీ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి పెద్ది సినిమాలో నటిస్తోంది. అలాగే దేవర 2 చిత్రంలో కూడా నటించబోతోంది. ఒకవైపు బాలీవుడ్ లో నటిస్తూనే మరొకవైపు టాలీవుడ్ లో కూడా పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి