తాజాగా అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి కొత్త పోస్టర్ రివీల్ చేశారు. టైటిల్ ను ఏప్రిల్ 8న ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పైన భారీ బడ్జెట్లోనే నిర్మిస్తున్నారు. గతంలో డైరెక్టర్ అట్లీ షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాని తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ తో ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి ఈ సినిమా పైన మరింత అంచనాలు పెరిగిపోయాయి.
ఈ చిత్రాన్ని ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించే విధంగా మార్క్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. భారీ విఎఫ్ఎక్స్ ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తదుపరి అప్డేట్ రేపటి రోజున విడుదల చేయబోతున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ అభిమానులకు బన్నీ బర్తడే కి ఒకరోజు ముందే అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు డైరెక్టర్ అట్లీ. మరి రేపటి రోజున మరిన్ని అప్డేట్ తో అభిమానులు ఎంత ఖుషీ అవుతారో చూడాలి మరి. చివరిగా అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు ఈ సినిమాతో సరికొత్త రికార్డులను కూడా తిరగరాశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి