బాలయ్యకు 'వీరసింహారెడ్డి' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని, ఇప్పుడు మరోసారి తన 111వ సినిమాతో బాలయ్యను వెండితెరపై విజువల్ ట్రీట్‌లా చూపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసి, ఈ ఏడాది దసరా పండుగ కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య మార్క్ డైలాగులు, గోపీచంద్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేయడం ఖాయం!
బాలయ్య కెరీర్‌లోనే ఇది అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ అని చెప్పాలి. వినూత్న చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో బాలయ్య ఒక భారీ బడ్జెట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విశేషమేమిటంటే, ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా దసరా పండుగ రోజున ప్రారంభం కానుంది. వివేక్ ఆత్రేయ మేకింగ్ స్టైల్ కి బాలయ్య మాస్ ఇమేజ్ తోడైతే, అదొక కొత్త రకమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది.
'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల చెప్పిన కథకు బాలయ్య ఫిదా అయిపోయాడు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాను 2027 సంక్రాంతి బరిలో నిలపాలని బాలయ్య లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ ఏడాది వేసవి తర్వాతే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. సంక్రాంతి అంటేనే బాలయ్య అడ్డా.. మరి పోలీస్ డ్రెస్ లో బాలయ్య ఇచ్చే వార్నింగ్‌లకు బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!
ప్రస్తుతం విజయ్ కనకమేడల సినిమాకు సంబంధించి కాస్టింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇందులో బాలయ్యకు జోడీగా ఎవరు నటించబోతున్నారు? విలన్‌గా ఎవరు కనిపిస్తారు? అనే విషయాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అటు గోపీచంద్ మలినేని షూటింగ్, ఇటు కొత్త ప్రాజెక్టులతో బాలయ్య ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.వయసు పెరుగుతున్నా కొద్దీ బాలయ్య వేగం, కసి ఇంకా పెరుగుతూనే ఉంది. దసరాకు ఒక లెక్క, సంక్రాంతికి మరో లెక్క అన్నట్టుగా బాలయ్య ప్లాన్ చేస్తున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి