అడవి శేషు హీరోగా మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం డెకాయిట్. ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రెండు రోజులలోనే రూ .28 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఈ చిత్రం. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 12న సక్సెస్ మీట్ నిర్వహించగా ఈ సక్సెస్ మీట్ కి నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరోయిన్ మృణాల్ ఠాగూర్ ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.



గతంలో ఒక సినిమా ఫంక్షన్ లో ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని మేచ్చుకుంటూ నువ్వు తెలుగింటి కోడలు అయితే బాగుంటుంది అంటూ సరదాగా అన్నారు. అయితే ఆమె మెగా ఫ్యామిలీకి కోడలుగా మారింది. ఇప్పుడు ఇదే సంఘటనను మళ్ళీ గుర్తు చేశారు అల్లు అరవింద్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ గురించి మాట్లాడుతూ నీకు ఒక మాట చెప్పాలి .. నువ్వు చాలా అద్భుతంగా నటిస్తున్నవు ,నువ్వు మాకు కావాలి నీ గ్లామర్, నీ యాక్టింగ్ తెలుగు ప్రేక్షకులు చాలా ఇష్టపడుతున్నారు. గతంలో ఒక అమ్మాయి (లావణ్య త్రిపాఠి) ని ఇలాగే దీవించాను. వరుణ్ ను వివాహం చేసుకొని ఇక్కడే ఉండిపోయింది.



అందుకే నీకు నా తరఫునుంచి ఒక చిన్న సలహా నువ్వు ఎలాగైనా సరే ఒక తెలుగు అబ్బాయిని చూసుకొని వివాహం చేసుకో అప్పుడు నువ్వు కూడా ఇక్కడే సెటిల్ అయిపోతావు మా టాలీవుడ్ హీరోయిన్ శాశ్వతంగా ఉండిపోవచ్చు అంటూ ఫన్నీగా అల్లు అరవింద్ మాట్లాడారు. ఈ మాటలకు మృణాల్ చాలా సిగ్గు పడిపోయింది. ఏకంగా ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఆనంద పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నేటిజన్స్ సైతం రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: