సింగర్ మంగ్లీ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఫోక్ సాంగ్స్ పాడడమే కాకుండా సినిమా పాటలు పాడి బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. అయితే తాజాగా సింగర్ మంగ్లీ పైన హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ తనను రూ .10 కోట్ల రూపాయలు మోసం చేసిందంటూ రెండు రోజుల క్రితం ఒక అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం పైన విచారణ కోసం తన లాయర్ తో కలిసి మంగ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్లారు.


తనపై సుబ్బారావు దుష్ప్రచారం చేస్తున్నారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మంగ్లీ. తన కార్యాలయానికి వచ్చి  రూ.10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఒకవేళ ఆ డబ్బులు ఇవ్వకపోతే తనను దుర్భాషలాడుతూ బెదిరించారంటు ఆమె ఫిర్యాదు చేసింది. డబ్బులు వసూళ్ల వ్యవహారంతో తనకి ఎలాంటి సంబంధం లేదంటూ తెలిపింది. తన పై కావాలనే ఇలా కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఎమోషనల్ గా మాట్లాడింది. తనకు డబ్బు ముఖ్యం కాదని పాటలు, వ్యక్తిత్వమే ముఖ్యమం అంటూ తెలియజేసింది.


ఈ వ్యవహారంలో తన పాత్ర ఉందని నిరూపిస్తే తాను ఏ పని చేయడానికి అయినా సిద్ధమేనని, కష్టపడి తాను ఈ స్థాయికి వచ్చాను తాను ఆ మూలాలను ఎప్పటికీ మర్చిపోలేనని.. మైక్రో ఫైనాన్స్ బాధితుల తరఫునుంచి కూడా తాను పోరాడుతానంటూ సింగర్ మంగ్లీ తెలియజేసింది. అయితే సుబ్బారావు కేవలం ఇదంతా బిగ్ బాస్ షో కోసం వల్లే చేస్తున్నారంటూ ఆమె ఆరోపణలు చేసింది. రాజకీయ ప్రచారాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం తనకి వచ్చినప్పటికీ వాటిని తిరస్కరించాను ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి అక్రమ ఆరోపణలు చేసే వారిని ఉపేక్షించానంటూ ఘాటుగానే స్పందించింది సింగర్ మంగ్లీ. తనపై వచ్చిన ఈ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: