అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న హీరో నాగచైతన్య. ప్రస్తుతం చైతూ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా వెళ్తూనే, అక్కినేని అభిమానులకు కావాల్సిన మాస్ మసాలాను కూడా లైన్‌లో పెడుతున్నారు. ‘తండేల్’ నుంచి ‘వృషకర్మ’ వరకు.. చైతూ లైనప్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమనిపిస్తోంది.


‘వృషకర్మ’ - అతీంద్రియ శక్తుల వేట!
‘విరూపాక్ష’తో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను పరిచయం చేసిన కార్తీక్ దండు, ఇప్పుడు నాగచైతన్యతో కలిసి ‘వృషకర్మ’ అనే మిథలాజికల్ థ్రిల్లర్‌ను ప్లాన్ చేశారు. ఇటీవల వచ్చిన గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేసింది. "అతీంద్రియ శక్తి మేల్కోన్నప్పుడు.. విధి ఒక వృషకర్మను ఎంచుకుంటుంది" అనే డైలాగ్ వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. మీనాక్షి చౌదరి గ్లామర్, కార్తీక్ దండు మేకింగ్, చైతూ పర్ఫార్మెన్స్ తోడైతే ఈ పాన్-ఇండియా చిత్రం ఇండియన్ సినిమా దగ్గర ఒక సెన్సేషన్ అవ్వడం గ్యారెంటీ!



మళ్ళీ ‘మనం’ మ్యాజిక్.. తండ్రితో కలిసి ‘కింగ్’ సైజ్ రచ్చ!
అక్కినేని అభిమానులకు అత్యంత ఇష్టమైన కాంబినేషన్ నాగార్జున - నాగచైతన్య. ‘మనం’, ‘బంగార్రాజు’ సినిమాలతో ఈ క్రేజీ జోడీ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టింది. ఇప్పుడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ రూపొందించబోయే కొత్త చిత్రంలో ఈ ఇద్దరూ మళ్ళీ కలిసి నటించబోతున్నారట. నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్‌లో చైతూ పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం. తండ్రీకొడుకుల మధ్య వచ్చే సీన్లు థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయం!



సిల్వర్ జూబ్లీ మూవీ - క్లాక్స్ డైరెక్షన్‌లో చైతూ 25!
నాగచైతన్య తన కెరీర్‌లో అత్యంత కీలకమైన 25వ చిత్రాన్ని ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. ‘బెదురులంక 2012’తో తన టాలెంట్ నిరూపించుకున్న డైరెక్టర్ క్లాక్స్, ఈ మైల్‌స్టోన్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. ఇది ఒక ఫ్రెష్ లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని టాక్. తన 25వ సినిమా అక్కినేని ఫ్యాన్స్‌కు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలని చైతూ స్క్రిప్ట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారట.



పక్కా ప్లానింగ్.. రికార్డుల వేట!
ఒకవైపు ‘తండేల్’ వంటి రా అండ్ రస్టిక్ మూవీ, మరోవైపు ‘వృషకర్మ’ వంటి మిథలాజికల్ థ్రిల్లర్, ఇంకోవైపు తండ్రితో మల్టీస్టారర్.. చైతూ లైనప్ చూస్తుంటే ఆయన రేంజ్ గ్లోబల్ లెవల్‌కు వెళ్తుందని క్లియర్ గా అర్థమవుతోంది. క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించే లవ్ స్టోరీలతో పాటు, మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే యాక్షన్ సినిమాలతో చైతూ తన మార్కెట్‌ను భారీగా పెంచుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: