ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక ప్రత్యేక సర్‌ప్రైజ్‌గా, ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘రాకా’కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలకు ఒక రోజు ముందు, చిత్ర బృందం ఒక ప్రీ-లుక్‌ను విడుదల చేసింది. ఆ ప్రీ-లుక్‌లో అల్లు అర్జున్ తన చేతిని పైకి ఎత్తి, మూడు వేళ్లను చూపిస్తూ ఒక ప్రత్యేకమైన మ్యానరిజాన్ని ప్రదర్శించాడు. అయితే, ఆ మ్యానరిజం అభిమానుల్లో పెద్దగా చర్చకు దారితీయలేదు, లేదా విపరీతంగా ట్రెండ్ కాలేదు.

ఇక ఇదే సమయంలో, ఇండియన్ క్రికెటర్ హార్ధిక్ పాడ్యా ఒక మ్యాచ్ సందర్భంగా చేసిన చర్య సోషల్ మీడియాలో కొత్త వివాదానికి కారణమైంది. ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో, హార్థిక్ పాండ్యా ఒక వికెట్ తీసిన తరువాత ప్రేక్షకులను అభివాదం చేస్తూ తన చేతిని పైకి ఎత్తి ఒక సంకేతం చేశాడు. ఇదే సమయంలో, అల్లు అర్జున్ పీఆర్ టీమ్ ఈ సంఘటనను ‘రాకా’ ప్రీ-లుక్‌లోని మ్యానరిజంతో అనుసంధానం చేస్తూ, హార్థిక్ పాండ్యా ఆ స్టైల్‌ను అనుకరించాడని ప్రచారం చేయడం ప్రారంభించింది. అయితే, ఈ వాదనను సోషల్ మీడియా యూజర్స్ పూర్తిగా తిరస్కరించారు. నెటిజెన్స్ ఈ ప్రచారాన్ని అతి చేసి చూపుతున్నారని భావిస్తూ తీవ్రంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

చాలామంది అభిప్రాయం ప్రకారం, హార్థిక్ పాండ్యా చేసింది ఒక సాధారణ సెలబ్రేషన్ మాత్రమే, దానిని సినిమా ప్రమోషన్‌తో అనవసరంగా లింక్ చేయడం సరైంది కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ చిన్న సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. మొత్తంగా చూస్తే, ఒక సాధారణ మ్యానరిజాన్ని పెద్ద వివాదంగా మార్చిన ఈ సంఘటన, సినిమా ప్రమోషన్ పద్ధతులపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. అభిమానులు, నెటిజెన్స్ ఈ విషయంపై విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాను హీట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: