టాలీవుడ్లో అక్కినేని కుటుంబానికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో చిత్రాలలో కలిసినటించి అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. నాగార్జున ఒకవైపు సినిమాలలో నటిస్తూనే తమ కుమారుల భవిష్యత్తును కూడా చక్కదిద్దుతున్నారు. నాగచైతన్య, అఖిల్ ఇద్దరు కూడా తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక నాగచైతన్య ప్రస్తుతం వృషకర్మ అనే పిరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ తో ఈ సినిమా రూపొందిస్తున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు నాగచైతన్య. ఈ సినిమా అయిపోయిన తర్వాత మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.


అది కూడా తన తండ్రి అయిన నాగార్జునతో కలిసి మరొకసారి వెండితెర పైన కనిపించబోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు విన్న అక్కినేని అభిమానులలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. గతంలో మనం, బంగార్రాజు చిత్రాలను తండ్రి కొడుకులు గా అలరించారు. ఇప్పుడు మూడవసారి అదే కాంబినేషన్ ని రిపీట్ చేయబోతున్నారు. సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న డైరెక్టర్ కల్యాణ కృష్ణ ఈ కొత్త ప్రాజెక్టుని తెరకెక్కిచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


అక్కినేని కుటుంబానికి కూడా ఈ డైరెక్టర్ బాగా కలిసి రావడంతో నాగచైతన్య, నాగార్జున ఇద్దరూ కూడా ఓకే చెప్పేసినట్లు టాలీవుడ్ లో టాక్. నాగచైతన్య 25వ సినిమా కోసం బెదురులంక 2012 డైరెక్టర్ క్లాక్స్ తో చేతుల కలిపినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయ్యాయని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నాగచైతన్య ఇమేజ్కు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రేమ కథ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా అయిపోగానే అటు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో కూడా మరో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: